పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వత్సాసురవధ

  •  
  •  
  •  

10.1-432-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నొక్కనాడు యమునాతీరంబున నా కుమారులు గోపకుమారులుం దారును గ్రేపుల మేప నొక్క రక్కసుండు క్రేపు రూపున వచ్చి వారల హింసింపం దలంచి.

టీకా:

అంతన్ = అప్పుడు; యమునా = యమునానదీ; తీరంబునన్ = తీరమునందు; ఆ = ఆ; కుమారులు = బాలకులు; గోపకుమారులున్ గొల్లపిల్లలు; తారును తాము; క్రేపులన్ = దూడలను; మేపన్ = మేపుతుండగ; ఒక్క = ఒకానొక; రక్కసుండు = రాక్షసుడు; క్రేపు = ఆవుదూడ; రూపంబునన్ = ఆకృతితో; వచ్చి = చేరి; వారలన్ = వారిని; హింసింపన్ = సంహరించవలెనని; తలంచి = భావించి.

భావము:

ఒకరోజు బలరామకృష్ణులు యమునానదీతీరాన గోపాలకులతో కలసి గోవత్సాలను మేపుతూ ఉండగా ఒక రాక్షసుడు వారిని చంపాలని వచ్చి తాను కూడా ఒక కోడెదూడ రూపం ధరించాడు.

10.1-433-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రేపుల యఱ్ఱులు నాకుచుఁ
గ్రేపులలో నిదియె మంచి క్రేపనఁగఁ గడుం
జూట్టి భక్త సంగతిఁ
గ్రేపై చనువాని మ్రోలఁ గ్రేపై తిరిగెన్.

టీకా:

క్రేపుల = ఆవుదూడల; అఱ్ఱులున్ = మెడలను; నాకుచున్ = నాకుతూ; క్రేపుల = అన్ని దూడలలోను; ఇదియె = ఇదే; మంచి = మంచి; క్రేపు = దూడ; అనగన్ = అన్నట్లుగా; కడున్ = మిక్కలి; చూపట్టి = కనబడి; భక్త = తనభక్తుల; సంగతిన్ = వెంట; క్రేపు = దూడ; ఐ = అయ్యి; చనువాని = వెళ్ళెడివానిని; మ్రోలన్ = ఎదుట; క్రేపు = దూడ; ఐ = అయ్యి; తిరిగెన్ = సంచరించెను.

భావము:

వాడు దూడలలో దూడ రూపం దాల్చి వాటితో కలసిపోయి మిగిలిన దూడల మెడలు నాకుతూ; ఉన్న వాటిలో ఇదే మంచి దూడ అన్నట్లు సంచరించాడు. భక్తుల వెంట దూడవలె సంచరించే కృష్ణుని వెనుక ఆ రాక్షసుడు దూడ రూపంలో తిరుగసాగాడు.

10.1-434-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాని నెఱింగి కృష్ణుండు రామునకుం జెప్పి

టీకా:

వానిన్ = అతనిని; ఎఱింగి = తెలిసికొని; కృష్ణుండు = కృష్ణుడు; రామున్ = బలరామున; కున్ = కు; చెప్పి = చెప్పి.

భావము:

ఆ వత్సాసురుడి విషయం ఎరిగిన కృష్ణుడు బెలరాముడుకి చెప్పి. . .

10.1-435-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ది యొక మంచిలేగ; వినుఁ డెంతయు నొప్పెడి" నంచు దాని త
త్పములు తోఁకయున్ బిగియఁట్టి చెలంగి వెలంగ మ్రానితోఁ
దియఁగ నొక్క పెట్టుగొని చంపెఁ గుమారుఁడు లేఁగరక్కసుం
గుదులుకొనంగ బాలకులు గోయని యార్వ నఖర్వ లీలతోన్.

టీకా:

ఇది = ఇది; ఒక = ఒకానొక; మంచి = మంచి; లేగ = లేగదూడ; వినుండు = వినండి; ఎంతయున్ = మిక్కలి; ఒప్పెడిన్ = అందముగ ఉంది; అంచున్ = అనుచు; దాని = దానిని; తత్ = ఆ; పదములున్ = కాళ్ళు; తోకయున్ = తోక; బిగియన్ = గట్టిగా; పట్టి = పట్టుకొని; చెలంగి = చెలరేగి; వెలంగ = వెలగ; మ్రాని = చెట్టుబోదె; తోన్ = తోటి; చదియగన్ = నలియునట్లు; ఒక్క = ఒకానొక; పెట్టు = దెబ్బ; కొని = కొట్టి; చంపెన్ = సంహరించెను; కుమారుడు = బాలకృష్ణుడు; లేగరక్కసున్ = వత్సాసురుని; కుదులుకొనంగ = కూలిపోయేలా; బాలకులు = గోపబాలురు; కో = కో; అని = అని; ఆర్వన్ = అరచుచుండగ; అఖర్వలీల = విస్తారమైన లీల; తోన్ = తోటి.

భావము:

కృష్ణుడు “ఆహా ఈ దూడ ఎంత మంచిదో చూసారా; ఎంత చక్కగా ఉందో చూడండి” అంటూ నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళాడు. గభాలున దాని కాళ్ళు తోక పట్టుకుని పైకెత్తి పెద్దపెట్టున వెలగచెట్టుకేసి మోదాడు. ఆ దెబ్బకు ఆ దూడ చితికి పచ్చడి అయిపోయింది. ఈ విధంగా దూడరూపంలో వచ్చిన వృత్సాసురుడు అనే రాక్షసుడు గిలగిల కొట్టుకుని చచ్చి పోయాడు. గోపాలకులు ఆనందంతో ఒక్కపెట్టున పెద్దగా కేకలు వేసారు.

10.1-436-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు రక్కసుండు వ్రేటుపడి విశాలంబగు సాలంబుతో నేలం గూలెను; అప్పుడు

టీకా:

ఇట్లు = ఈ విధముగ; రక్కసుండు = రాక్షసుడు; వ్రేటుపడి = చనిపోయి; విశాలంబు = పెద్దది; అగు = ఐన; సాలంబు = మాను; తోన్ = తోటి; నేలంగూలెన్ = మరణించెను; అప్పుడు = ఆ సమయమునందు.

భావము:

అలా అ రాక్షసుడు దెబ్బ తిని నేలకూలాడు ఆ దెబ్బకు అంత పెద్ద చెట్టు సైతం కూలిపోయింది. .

10.1-437-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గొండు లెగురఁగ వైచుచుఁ
జంగున దాఁటుచును జెలఁగి ప్పట లిడుచుం
బొంగుచుఁ గృష్ణుని బొగడుచు
ద్రుంగిన రక్కసునిఁ జూచి త్రుళ్ళిరి కొమరుల్.

టీకా:

గొంగడులు = కంబళ్ళు, రగ్గులు; ఎగురగన్ = పైకెగురునట్లు; వైచుచున్ = వేయుచు; చంగునన్ = చెంగుమని; దాటుచునున్ = ఎగిరిదాటుతూ; చెలగి = విజృంభించి; చప్పటలు = చప్పట్లు; ఇడుచున్ = కొట్టుతూ; పొంగుచున్ = ఉప్పొంగుతు; కృష్ణుని = బాలకృష్ణుని; పొగడుచున్ = స్తుతించుచు; త్రుంగిన = చచ్చిపోయిన; రక్కసునిన్ = రాక్షసుని; చూచి = కనుగొని; త్రుళ్ళిరి = గర్వించి గంతులు వేసిరి; కొమరుల్ = బాలకులు.

భావము:

గోపకుమారులు చచ్చి పడిన రాక్షసుని చూసి పట్టరాని ఉత్సాహంతో గొంగళ్ళు ఎగురవేసారు. ఎగిరి దూకారు. చప్పట్లు కొట్టారు. తృళ్ళింతలతో పొంగిపోయారు. కృష్ణుని బలాన్ని పొగిడారు.

10.1-438-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ సమయంబున వేలుపులు విరులవానలు గురియించి రివ్విధంబున.

టీకా:

ఆ సమయంబునన్ = అప్పుడు; వేలుపులు = దేవతలు; విరుల = పూల; వానలు = జల్లులు; కురియించిరి = కురిపించిరి; ఈ = ఈ; విధంబునన్ = విధముగ;

భావము:

అప్పుడు దేవతలు పూలవానలు కురిపించారు. ఇలా....

10.1-439-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్సముల పగిది జగముల
త్సలతన్ మనుపఁ జూచువాఁడై యుంటన్
త్సముల మేపు చుండియు
త్సాసురుఁ జంపె భక్తత్సలుఁ డధిపా!

టీకా:

వత్సములన్ = ఆవుదూడలను {వత్సము - ఒక సంవత్సరములోపు దూడ}; పగిదిన్ = వలెనే; జగములన్ = లోకములను; వత్సలతన్ = వాత్సల్యముతో; మనుపన్ = కాపాడవలెనని; చూచువాడు = పూనునట్టివాడు; ఐ = అయ్యి; ఉంటన్ = ఉండుటచే; వత్సములన్ = దూడలను; మేపుచుండియున్ = మేపుతున్నను; వత్సారున్ = వత్సుడు అనెడి రాక్షసుని; చంపెన్ = సంహరించెను; భక్తవత్సలుడు = శ్రీకృష్ణుడు {భక్త వత్సలుడు - భక్తుల ఎడ వాత్సల్యము కలవాడు, విష్ణువు}; అధిపా = రాజా.

భావము:

పరీక్షిన్మహారాజా! ఆవు తన దూడను రక్షించు నట్లు ఈ లోకాలు అన్నింటిని వాత్సల్యభావంతో రక్షించడానికి అవతరించాడు. కనుక భక్తులను కన్నబిడ్డలవలె కాపాడే కృష్ణుడు దూడలను మేపుతూ ఉండి కూడా దుర్మార్గుడైన వృత్సాసురుణ్ణి చంపివేసాడు.

10.1-440-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నొక్కనాడు రేపకడ గోపకుమారులు క్రేపులం గొంచు నడవికిం జని యెండంబడి మెండుకొనిన దప్పిని బెండుపడిన తమ తమ లేఁగకదుపుల నేర్పరించి నిలువరించుకొని కలంకంబు లేని యొక్క కొలంకున నీరు ద్రావించి తారును జలపానంబు జేసి వచ్చునెడ నందు.
బకాసుర వధ >>

టీకా:

మఱియున్ = ఇంకను; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; రేపకడ = ఉదయమే; గోపకుమారులు = గొల్లపిల్లలు; క్రేపులన్ = ఆవుదూడలను; కొంచున్ = తీసుకొని; అడవి = అడవి; కిన్ = కి; చని = వెళ్ళి; ఎండన్ = ఎండకు; పడి = గురై; మెండుకొనిన = అధికమైన; దప్పిన్ = దాహముతో; బెండుపడిన = నీరసించిపోగా; తమతమ = వారివారి; లేగ = లేగదూడల; కదుపులన్ = సమూహములను; ఏర్పరించుకొని = విభజించుకొని; నిలువరించుకొని = నిలుపుకొని; కలంకంబు =ముఱికి, మాలిన్యము; లేని = లేనట్టి; ఒక్క = ఒకానొక; కొలంకునన్ = చెరువలో; నీరున్ = నీటిని; ద్రావించి = తాగించి; తారును = వారుకూడ; జలపానంబు = నీళ్ళుతాగుట; చేసి = చేసి; వచ్చున్ = వచ్చెడి; ఎడన్ = సమయము; అందు = అందు.

భావము:

అలా తిరిగి వస్తున్నప్పుడు పుణ్యమూర్తులైన ఆ బాలకులు మహా భయంకరమైన ఒక కొంగను చూసారు. పూర్వం ఇంద్రుని వజ్రాయుధం రెక్కలను విరగగొట్టగా క్రిందపడిన పెద్ద కొండశిఖరమా అన్నట్లు ఆ కొంగ నిలపడి ఉంది. భయంకరమైన పెద్ద కన్నులతో కృష్ణుని చంపడానికి అక్కడ వేచి ఉంది.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •