పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : మథురకు నారదుడు వచ్చుట

  •  
  •  
  •  

10.1-53-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాదు మాటలు విని పె
ల్లారాటముఁ బొంది యదువు నిమిషు లనియున్
నారాయణకరఖడ్గవి
దారితుఁ డగు కాలనేమి దా ననియు మదిన్.

టీకా:

నారదున్ = నారదుని యొక్క; మాటలు = పలుకులు; విని = విని; పెల్లు = అధికమైన; ఆరాటమున = పరితాపమును; పొంది = చెంది; యదువులు = యాదవులు; అనిమిషులు = దేవతలు {అనిమిషులు - నిమిషము (కనురెప్పపాటు)లు లేనివారు, దేవతలు}; అనియున్ = అని; నారాయణుని = విష్ణుని {నారాయణుడు - నారములు (నీటి) యందు ఉండువాడు, విష్ణువు}; కర = చేతియందలి; ఖడ్గ = కత్తి (నందకము) చేత; విదారితుడు = నరకబడినవాడు; అగు = ఐన; కాలనేమి = కాలనేమి అనెడివాడు; తాను = తనే; అనియున్ = అని; మదిన్ = మనసు నందు.

భావము:

నారదుని మాటలు విన్న కంసుడు, యాదవులు దేవతలని; శ్రీహరి చేతి కత్తికి బలై చనిపోయిన కాలనేమి తానే అని; తలచాడు. ఎంతో ఆరాటం పొంది, మనసులో....