పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గుహ్యకుల నారదశాపం

  •  
  •  
  •  

10.1-396-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కవాని సుతుల మనుచును
కంఠులతోడఁ గూడి కానరు పరులం
లో నైనను; వీరికిఁ
క్రొవ్వడఁగించి బుధులఁ లపుట యొప్పున్."

టీకా:

కలవాని = సంపన్నుని; సుతులము = పుత్రులము; అనుచున్ = అని యెంచుకొని; కలకంఠులు = సుందరీమణుల {కలకంఠి - కోయిలవంటి గొంతు కలామె, స్త్రీ}; తోడన్ = తోడి; కూడి = చేరి; కానరు = లక్ష్యపెట్టరు; పరులన్ = ఇతరులను; కల = స్వప్నము; లోన్ = అందు; ఐనను = అయినప్పటికి; వీరి = వీరల; కిన్ = కు; కల = కలిగినట్టి; క్రొవ్వు = గర్వము; అడగించి = అణచివేసి; బుధులన్ = ఙ్ఞానులందు; కలపుట = చేర్చుట; ఒప్పున్ = చక్కనిపని.

భావము:

"ఈ యక్షరాజు కుమారులు ధనవంతుని కొడుకులమని గర్వించి ఉన్నారు; పైగా ప్రేయసులతో కూడి ఉన్నారు. ఇక చెప్పేదేమి ఉంది. వీరికి కొవ్వు అణచి మళ్ళీ సత్పురుషులనుగా మార్చటం సముచితమైన పని."