పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : హరిహరా భేదము చూపుట

  •  
  •  
  •  

10.1-303-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లవగృహ నవనీతము
లెల్లను భక్షించి వచ్చి, యెఱుఁగని భంగిం
ల్లిఁ గదిసి చిట్టాడుచు,
ల్లనఁ జను "బువ్వఁ బెట్టు వ్వా!" యనుచున్.

టీకా:

వల్లవ = గోపికా; గృహంబున్ = ఇండ్లలోని; నవనీతములు = వెన్నలు; ఎల్లను = అన్నిటిని; భక్షించి = తినివేసి; వచ్చి = వచ్చి; ఎఱుగని = ఏమీ తెలియనివాని; భంగిన్ = వలె; తల్లిన్ = తల్లిని; కదిసి = చేరి; చిట్టాడుచున్ = ఇటునటు తిరుగుచు; అల్లనన్ = మెల్లిగా; చనున్ = వెళ్ళును; బువ్వ = అన్నము; పెట్టుము = పెట్టు; అవ్వా = అమ్మా; అనుచున్ = అంటూ.

భావము:

గోపికల ఇళ్ళల్లో వెన్నంతా తిని యింటికి వచ్చి, అల్లరి కృష్ణుడు ఏమీ తెలియనివానిలా మెల్లిగా తల్లి పక్కకి చేరతాడు. "అమ్మా బువ్వ పెట్టు" అంటు ఊరికే ఇల్లంతా తిరిగేస్తాడు.