పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : బలరామ కృష్ణుల క్రీడాభివర్ణన

  •  
  •  
  •  

10.1-293-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వుల నవిద్య పోఁడిమి
గుబాటుగఁ జేయనేర్చు గవరి యంతన్
గుమొగముతోడ మెల్లన
గుమొగముల సతులఁ జూచి గనేర్చె నృపా!

టీకా:

నగవులన్ = నవ్వులతో; అవిద్య = మాయల యొక్క; పోడిమి = సమర్థత; నగుబాటుగ = పరిహాసముగ; చేయన్ = చేయగలుగుట; నేర్చు = తెలిసిన; నగవరి =పరిహాస వేది; అంతన్ = అప్పుడు; నగు = నవ్వు; మొగము = మోము; తోడన్ = తోటి; మెల్లనన్ = మృదువుగ; నగుమొగముల = చిరునవ్వులు కల; సతులన్ = ఇంతులను; చూచి = కనుగొని; నగన్ = నవ్వుట; నేర్చెన్ = నేర్చుకొనెను; నృపా = రాజా.

భావము:

ఓ పరీక్షిన్మహారాజా! మహావిష్ణువు చిరునవ్వు నవ్వితే ఆత్మజ్ఞానము కాని లౌకిక విద్యలను దట్టమైన అజ్ఞానం నవ్వులపాలై, జ్ఞానం పుట్టుకు వస్తుంది. అంతటి పరదైవము మానవ బాలకృష్ణునిగా తనను చూసి నవ్వుతున్న గోపకాంతలను చూసి నవ్వటం నేర్చాడు.