పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : బలరామ కృష్ణుల నామకరణం

  •  
  •  
  •  

10.1-287-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“జనులు రమియింపఁ దిరిగెడి
నువు కలిమి రాముఁ డనియు దు సంకర్షం
బు సంకర్షణుఁ డనియును
బలమున బలుడు ననియు ణుతించె నృపా!”

టీకా:

జనులున్ = ప్రజలు; రమియింపన్ = సంతోషించునట్లుగ; తిరిగెడి = మెలగెడి; అనువు = మెలకువ; కలిమిన్ = ఉండుటచేత; రాముడు = రాముడు; అనియున్ = అని; యదు = యాదవులను, యదువంశాంకురం; సంకర్షంబునన్ = కలిపి యుంచుటచే, లాగబడుటచేత; సంకర్షణుఁడు = సంకర్షణుడు; అనియునున్ = అని; ఘన = మిక్కిలి అధికమైన; బలమునన్ = శక్తి కలిగి యుండుటచే; బలుడు = బలుడు; అనియున్ = అని; గణుతించెన్ = ఎంచెను (నామములను); నృపా = రాజా.

భావము:

ఓ రాజా1 ఈ రోహిణీ కుమారుడుకి లోకులు అందరు సంతోషించేలా ప్రవర్తించేవాడు కనుక రాముడు అనీ. యాదవులలో ఐకమత్యం పెంచి కలిసి మెలిసి ఉండేలా చూసేవాడు కనుక సంకర్షణుడు అనీ. గొప్ప బలవంతుడు కనుక బలుడు అనీ గర్గుడు నామకరణం చేసాడు.