పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పాలుతాగి విశ్వరూప ప్రదర్శన

  •  
  •  
  •  

10.1-284-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఊక రారు మహాత్ములు
వా ధముల యిండ్లకడకు చ్చుట లెల్లం
గాణము మంగళములకు
నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా!

టీకా:

ఊరక = కారణము లేకుండగ; రారు = రాబోరు; మహాత్ములు = గొప్పవారు {మహాత్ములు - గొప్ప చిత్తవృత్తి గలవారు, గొప్పవారు}; వారు = అట్టివారు; అధముల = అల్పుల; ఇండ్ల = నివాసముల; కడ = వద్ద; కున్ = కు; వచ్చుట = రావడ మన్నది; ఎల్లన్ = అంతయు; కారణము = కారణము; మంగళముల్ = శుభముల; కున్ = కు; నీ = నీ యొక్క; రాక = వచ్చుట; శుభంబు = మంచిది; మా = మా; కున్ = కు; నిజము = తథ్యము యిది; మహాత్మా = గొప్పవాడా.

భావము:

"ఓ మహాత్ముడవైన గర్గమహాముని! మీవంటి పెద్దలు, మా వంటి సామాన్యుల ఇళ్ళకు ఉత్తినే రారు. వచ్చారంటే తప్పకుండా ఏదో గొప్ప మేలు సిద్ధించడానికి మాత్రమే. అందుకే "ఊరక రారు మహాత్ములు" అన్న నానుడి ప్రసిద్ధమైంది కదా. కాబట్టి, తమ రాక వలన మాకు తప్పకుండా శుభాలు కలుగుతాయి. ఇది సత్యం.