పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పూతన బాలకృష్ణుని చూచుట

  •  
  •  
  •  

10.1-218-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లోకేశ్వరుఁ, డా చరాచరవిభుం, డా బాలగోపాలుఁ, డా
బాధ్వంసిని గొంటు కంటిడి వెసన్ బాలింతచందంబునన్,
బాలిండ్లన్ విష మూని, వచ్చుట మదిన్ భావించి, లో నవ్వుచున్
గాలుం గేలు నెఱుంగకున్న కరణిం న్మోడ్చి, గుర్వెట్టుచున్.

టీకా:

ఆ = ఆ; లోకేశ్వరుడు = కృష్ణుడు {లోకేశ్వరుడు – సమస్తమైన లోకములకు ప్రభువు, విష్ణువు}; ఆ = ఆ; చరాచరవిభుండు = కృష్ణుడు {చరాచరవిభుడు - కదల గలవి లేనివి రెంటికి ప్రభువు, విష్ణువు}; ఆ = ఆ; బాల = శిశురూపుడైన; గోపాలుడు = యాదవుడు, కృష్ణుడు; ఆ = ఆ; బాల = శిశు; ధ్వంసిని = హంతను; గొంటు = దుష్టురాలు; కంటన్ = పగ, పట్టు; ఇడి = పట్టి; వెసన్ = శ్రీఘ్రముగా; బాలింత = పసిబిడ్డతల్లి; చందంబునన్ = వలె; పాలిండ్లన్ = స్తనము లందు; విషమున్ = విషమును; ఊని = ధరించి; వచ్చుట = వచ్చుటను; మదిన్ = మనసులో; భావించి = ఊహించి; లోన్ = మనసులో; నవ్వుచున్ = నవ్వుకొనుచు; కాలున్ = ఇవి కాళ్ళు; కేలున్ = ఇవి చేతులు; ఎఱుంగక = అని తెలియని స్థితిలో; ఉన్న = ఉన్నట్టి; కరణిన్ = విధముగ; కన్ = కళ్ళను; మోడ్చి = మూసికొని; గుర్వెట్టుచున్ = గుఱ్ఱుపెడుతు.

భావము:

అలా పూతన వస్తోంది. లోకాలు అన్నిటికి ఈశ్వరుడు. ఈ చరాచర జగత్తు అంతటికి ప్రభువు. బాల కృష్ణుడిగా అవతరించిన వాడు ఐన అతడు, ఆ శిశు హంతకిని చూశాడు. క్రూరాత్మురాలు దురాత్మురాలు అయిన ఆ పూతన కోరి బాలింతరాలి వేషంలో వక్షోజాలలో విషం ధరించి వస్తోంది అని గ్రహించాడు. లోలోపల నవ్వుకొని కాలు చెయ్యి తెలియకుండా నిద్రపోతున్నట్లు గుఱ్ఱు పెట్ట సాగాడు.