పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వసుదేవ నందుల సంభాషణ

  •  
  •  
  •  

10.1-210-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"జపతి కరి యిడితివి; మముఁ
నుఁగొంటివి; మేము నిన్నుఁ గంటిమి; మే ల
య్యెను; బొమ్మింకను గోకుల
ము నుత్పాతములు దోఁచు మునుకొనవలయున్. "

టీకా:

జనపతి = రాజున; కిన్ = కు; అరి = కప్పము; ఇడితివి = కట్టితివి; మమున్ = మమ్ములను; కనుగొంటివి = చూచితివి; మేమున్ = మేముకూడ; నిన్నున్ = నిన్ను; కంటిమి = చూచితిమి; మేలు = బాగుగనే; అయ్యెన్ = జరిగినది; పొమ్ము = వెళ్ళిపొమ్ము; ఇంకను = వెంటనే; గోకులమునన్ = మంద యందు; ఉత్పాతములన్ = ఆపదలు తోపించుట; తోచున్ = కనబడుచున్నది; మునుకొనవలయున్ = ఎదుర్కొనవలెను.

భావము:

“కంసుడికి పన్నులు చెల్లించావు; మమ్మల్ని చూడటానికి వచ్చావు; మేమూ నిన్ను చూసాము; మంచిది. గోకులంలో ఉత్పాతాలు సంభవించే సూచనలు ఉన్నాయి. ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే బయలుదేరు.”