పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మిణీ కల్యాణంబు

  •  
  •  
  •  

10.1-1786-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి పెండ్లికిఁ గైకేయక
కురు సృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రుల్
మానందముఁ బొందిరి
ణీశులలోన గాఢ తాత్పర్యములన్.

టీకా:

హరి = కృష్ణుని; పెండ్లి = వివాహమున; కిన్ = కు; కైకేయ = కైకేయ వంశపు; కురు = కురు వంశపు; సృంజయ = సృంజయ వంశపు; యదు = యదు వంశపు; విదర్భ = విదర్భ దేశపు; కుంతి = కుంతి భోజుని వంశపు; నరేంద్రులు = రాజులు; పరమ = అధికమైన; ఆనందమున్ = సంతోషమును; పొందిరి = పొందిరి; ధరణీశుల = రాజుల {ధరణీశుడు - ధరణి (భూమికి) ఈశుడు (ప్రభువు), రాజు}; లోనన్ = అందలి; గాఢ = దృఢమైన; తాత్పర్యములన్ = మంచి అభిప్రాయములతో.

భావము:

శ్రీకృష్ణమూర్తి కల్యాణానికి, రాజు లందరి లోను కైకయ, కురు, సృంజయ, యదు, విదర్భ, కుంతి దేశాల రాజులు అధికమైన పరమానందం పొందారు.