పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మిణీ కల్యాణంబు

  •  
  •  
  •  

10.1-1785-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తులుం దారునుఁ బౌరులు
హిమతిఁ గానుకలు దెచ్చి యిచ్చిరి కరుణో
న్న వర్ధిష్ణులకును మా
ని రోచిష్ణులకు రుక్మిణీకృష్ణులకున్.

టీకా:

సతులున్ = భార్యలు; తారునున్ = తాము కలిసి; పౌరులు = పురజనులు; హితమతిన్ = ఇష్టపూర్వకముగా; కానుకలున్ = బహుమతులు; తెచ్చి = తీసుకు వచ్చి; ఇచ్చిరి = ఇచ్చిరి; కరుణ = దయచేత; ఉన్నత = గొప్పవహించిన; వర్ధిష్ణుల్ = వృద్ధిపొందు గుణము కల వారి; కును = కు; మానిత = మన్నింపదగిన; రోచిష్ణుల = ప్రకాశవంత స్వభావము కల వారి; కున్ = కి; రుక్మిణీ = రుక్మిణీదేవి; కృష్ణుల = కృష్ణుడుల; కును = కు.

భావము:

అపార కృపా వర్ధిష్ణులు, అఖండ తేజో విరాజితులు రుక్మిణీ శ్రీకృష్ణులకు ద్వారకాపుర వాసులు తమ భార్యలతో వచ్చి మనస్ఫూర్తిగా కానుకలు తెచ్చి ఇచ్చారు.