పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మిణీ కల్యాణంబు

  •  
  •  
  •  

10.1-1784-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధ్రుకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై
గాంభీర్య విహారిణిన్ నిఖిల సంత్కారిణిన్ సాధు బాం
సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్
సువిభూషాంబర ధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్.

టీకా:

ధ్రువ = శాశ్వతమైన; కీర్తిన్ = కీర్తితో; హరి = కృష్ణుడు; పెండ్లి = వివాహము; ఆడెన్ = చేసుకొనెను; నిజ = తన యొక్క; చేతః = మనసును; హారిణిన్ = అపహరించినామెను; మాన = చిత్తౌన్నత్యము; వైభవ = ఐశ్వర్యము; గాంభీర్య = నిబ్బరములు కలిగి; విహారిణిన్ = విహరించెడి ఆమెను; నిఖిల = సర్వ; సంపత్ = సంపదలను; కారిణిన్ = కలిగించెడి ఆమెను; సాధు = మంచివారిని; బాంధవ = బంధువులను; సత్కారిణిన్ = సత్కరించునామెను; పుణ్య = మంచి; చారిణిన్ = నడవడిక కలామెను; మహా = గొప్ప; దారిద్ర్య = పేదరికములను; సంహారిణిన్ = నశింపజేయునామెను; సు = మంచి; విభూష = ఆభరణములను; అంబర = వస్త్రములు; ధారిణిన్ = ధరించు నామెను; గుణవతీ = సుగుణవంతురాలలో; చూడామణిన్ = శ్రేష్ఠురాలును; రుక్మిణిన్ = రుక్మిణీదేవిని.

భావము:

రుక్మిణీదేవి ఆత్మోన్నత్యం, మహావైభవం, గాంభీర్యాలతో మెలగుతుంది. సకల సంపదలు కలిగిస్తుంది. సాధువులను బంధువులను చక్కగ సత్కరిస్తుంది. పుణ్యకార్యాలు చేస్తుంది, మహాదరిద్రాన్ని పోగొడు తుంది. చక్కటి భూషణాలు వస్త్రాలు ధరించిన, అలాంటి సుగుణాల నారీ శిరోమణి, తన మనోహారి యైన రుక్మణిని ఆ శుభ సమయంలో వివాహమాడాడు. శాశ్వతమైన యశస్సు పొందాడు.