పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మిణీ కల్యాణంబు

  •  
  •  
  •  

10.1-1782-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజీవలోచనుఁడు హరి
రాసమూహముల గెల్చి రాజస మొప్పన్
రాజిత యగు తన పురికిని
రాజాననఁ దెచ్చె బంధురాజి నుతింపన్.

టీకా:

రాజీవలోచనుడు = పద్మాక్షుడు, కృష్ణుడు; హరి = కృష్ణుడు; రాజ = రాజుల; సమూహములన్ = సమూహములను; గెల్చి = జయించి; రాజసము = గొప్పదనము; ఒప్పన్ = చక్కగా కనబడుతుండ; రాజిత = ప్రకాశించునది; అగు = ఐన; తన = అతని; పురి = పట్టణమున; కిన్ = కు; రాజాననన్ = చంద్రముఖిని, రుక్మిణిని; తెచ్చెన్ = తీసుకు వచ్చెను; బంధు = బంధువుల; రాజిత = సమూహము; నుతింపన్ = పొగడుతుండగా.

భావము:

పద్మాక్షుడు కృష్ణుడు రాజుల నందరిని జయించి రాజస ముట్టిపడేలా విభ్రాజితమైన తన పట్టణానికి ఇందుముఖి రుక్మిణిని చేపట్టి తీసుకు వచ్చేడు. బంధువు లంతా పొగిడారు.