పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మి యనువాని భంగంబు

  •  
  •  
  •  

10.1-1780-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జ్ఞానజ మగు శోకము
విజ్ఞానవిలోకనమున విడువుము నీకుం
బ్రజ్ఞావతికిం దగునే
జ్ఞానుల భంగి వగవ, నంభోజముఖీ!"

టీకా:

అజ్ఞాన = అజ్ఞానమువలన; జము = కలుగునది, పుట్టునది; అగు = ఐన; శోకము = దుఃఖమును; విజ్ఞాన = ఆత్మజ్ఞానము అనెడి; విలోకనమునన్ = దృష్టిచేత; విడువుము = వదలివేయుము; నీ = నీ; కున్ = కు; ప్రఙ్ఞావతి = సమర్థురాలు; కిన్ = కి; తగునే = తగినదా, కాదు; అజ్ఞానుల = అజ్ఞానుల; భంగిన్ = వలె; వగవన్ = దుఃఖించుట; అంభోజముఖీ = పద్మాక్షి, రుక్మిణీ.

భావము:

పద్మం లాంటి ముఖము కలదానా! రుక్మిణీ! అజ్ఞానము వలన కలిగే దుఃఖాన్ని విజ్ఞానదృష్టితో విడిచిపెట్టు. నీ లాంటి సుజ్ఞానికి అజ్ఞానులలాగ దుఃఖించుట తగదు. అంటు బలరాముడు రుక్మిణిని సముదాయించసాగాడు.
– బహు కఠినమైన జ్ఞకార ప్రాసతో, అది అచ్చు ఆ కూడ ప్రాసగా సమానంగా ఉంచి, అజ్ఞాన విజ్ఞాన, ప్రజ్ఞానాలతో ఇలా అమృత గుళికను అందించిన పోతనగారికి ప్రణామములు.