పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మి యనువాని భంగంబు

  •  
  •  
  •  

10.1-1778-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూమికి ధన ధాన్యములకు
భాలకును మానములకుఁ బ్రాభవములకుం
గామించి మీఁదుఁ గానరు
శ్రీ దమున మానధనులు చెనఁకుదు రొరులన్.

టీకా:

భూమి = రాజ్యము; కిన్ = కోసము; ధన = సిరి; ధాన్యముల్ = సంపదల; కున్ = కోసము; భామల్ = స్త్రీల; కును = కోసము; మానముల్ = గౌరవముల; కున్ = కోసము; ప్రాభవముల = వైభవముల; కున్ = కోసము; కామించి = కోరి; మీదున్ = రాబోవు నరకాదులను; కానరు = విచారింపరు; శ్రీ = సంపద; మదమునన్ = గర్వముచేత; మానధనులు = మానమే ధనంగా కలవారు; చెనకుదురు = హింసించెదరు; ఒరులన్ = ఇతరులను.

భావము:

మానవంతులు ధనమదాంధులు అయ్యి, రాజ్యం కోసం ధనధాన్యాల కోసం, స్త్రీల కోసం, పరువు కోసం, అధికారాల కోసం అఱ్ఱులు చాచి కిందు మీదు కానరు. ఇతరులను హింసిస్తారు.