పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మి యనువాని భంగంబు

  •  
  •  
  •  

10.1-1777-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రహ్మచేత భూమితుల కీ ధర్మంబు
ల్పితంబు రాజ్యకాంక్షఁ జేసి
తోడిచూలు నైనఁదోడఁ బుట్టినవాఁడు
చంపుచుండుఁ గ్రూర రితుఁ డగుచు.

టీకా:

బ్రహ్మ = బ్రహ్మదేవుని; చేత = వలన; భూమిపతుల్ = రాజుల; కున్ = కు; ఈ = ఇలాంటి; ధర్మంబు = ఆచారము; కల్పితంబు = ఏర్పరచబడినది; రాజ్య = రాజ్యాధికారమునందలి; కాంక్షన్ = గట్టికోరిక; చేసి = వలన; తోడిచూలున్ = తోడబుట్టినవారిని; ఐనన్ = అయినప్పటికి; తోడబుట్టినవాడు = సోదరుడు; చంపుచున్ = చంపేస్తూ; ఉండున్ = ఉండును; క్రూర = క్రూరమైన; చరితుడు = నడవడిక కలవాడు; అగుచున్ = అగుచు.

భావము:

రాజ్యకాంక్షతో తోబుట్టినవానిని అయినాసరే, తోడబుట్టిన వాడు క్రూరంగా చంపేస్తాడు. ఇది బ్రహ్మచేత క్షత్రియులకు కల్పించబడిన ధర్మం.