పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మి యనువాని భంగంబు

  •  
  •  
  •  

10.1-1776-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"చంపెడి దోషము గలిగినఁ
జంపఁ జనదు బంధుజనులఁ ను విడువంగాఁ
జంపిన దోషము సిద్ధము
చంపఁగ మఱి యేల మున్న చ్చిన వానిన్.

టీకా:

చంపెడి = చంపదగిన; దోషము = తప్పు; కలిగినన్ = జరిగినను; చంపన్ = చంపివేయుట; చనదు = ధర్మముకాదు; బంధు = బంధువులైన; జనులన్ = వారిని; చనున్ = తగినపని; విడువంగాన్ = విడిచిపెట్టుట; చంపినన్ = చంపివేసినచో; దోషము = పాపము; సిద్ధము = తప్పకుండా కలుగును; చంపగన్ = చంపుట; మఱి = ఇంకా; ఏలన్ = ఎందుకు; మున్ను = ముందుగనే; చచ్చిన = (అవమాన భారంతో) చచ్చిపోయిన; వానిన్ = వాడిని.

భావము:

చంపదగ్గ తప్పు చేసినా సరే బంధువులను చంపరాదు. వదిలెయ్యాలి. అలాకాక చంపితే పాపం, తప్పదు. అసలే అవమాన భారంతో ముందే చచ్చినవాడిని వేరే చంపటం దేనికి.