పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మి యనువాని భంగంబు

  •  
  •  
  •  

10.1-1775-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"తోడంబుట్టినవాని భంగమునకున్ దుఃఖించి మా కృష్ణు నె
గ్గాడం జూడకు మమ్మ! పూర్వభవ కర్మాధీనమై ప్రాణులం
గీడున్ మేలునుఁ జెందు; లేఁ డొకఁడు శిక్షింపంగ రక్షింప నీ
తోడంబుట్టువు కర్మశేష పరిభూతుం డయ్యె నే డీ యెడన్."

టీకా:

తోడంబుట్టినవానిన్ = సోదరుని; భంగమున్ = అవమానమున; కున్ = కు; దుఃఖించి = విచారించి; మా = మా యొక్క; కృష్ణున్ = కృష్ణుని; ఎగ్గాడన్ = నిందింప; చూడకుము = భావింపకుము; అమ్మ = తల్లీ; పూర్వ = మునుపటి; భవ = జన్మములందు జేసిన; కర్మ = కర్మములకు; అధీనము = అనుసరించునది; ఐ = అయ్యి; ప్రాణులన్ = జీవులకు; కీడున్ = ఆపద; మేలున్ = మంచి; చెందున్ = కలుగును; లేడు = లేడు; ఒకడు = వేరొకడు; శిక్షింపంగన్ = శిక్షించుటకు; రక్షింపన్ = కాపాడుటకు; నీ = నీ యొక్క; తోడంబుట్టువు = అన్న; కర్మ = పూర్వజన్మకర్మఫలముల; శేష = మిగిలినదానిచేత; పరిభూతుండు = అవమానింపబడినవాడు; అయ్యెన్ = అయ్యెను; నేడు = ఇవాళ; ఈ = ఈ యొక్క; ఎడన్ = చోటునందు.

భావము:

“అన్నకు జరిగిన అవమానానికి దుఃఖించకు. మా కృష్ణుడిని నిందించబోకు తల్లీ! పూర్వజన్మలలోని కర్మానుసారం జీవులకు మంచిచెడులు సంభవిస్తాయి. శిక్షించడానికి కాని రక్షించడానికి కాని కర్త ఎవరు లేరు. నీ అన్న అనుభవించ వలసిన శేష కర్మఫలం వలన ఇప్పుడు ఈ పరాభవం పొందాడు.