పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మి యనువాని భంగంబు

  •  
  •  
  •  

10.1-1773-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కొంఱు రిపు లని కీడును;
గొంఱు హితు లనుచు మేలుఁ గూర్పవు; నిజ మీ
వంఱి యందును సముఁడవు;
పొందఁగ నేలయ్య విషమబుద్ధి? ననంతా!"

టీకా:

కొందఱున్ = కొంతమంది; రిపులు = శత్రువులు; అని = అని; కీడును = చెడును; కొందఱున్ = కొంతమంది; హితులు = ఇష్ఠులు; అనుచున్ = అని; మేలున్ = మంచిని; కూర్పవు = కలిగింపవు; నిజము = సత్యము ఇది; ఈవు = నీవు; అందఱి = అందరి; అందును = ఎడల; సముడవు = సమభావము కలవాడవు; పొందగన్ = పొందుట; ఏలన్ = ఎందుకు; అయ్య = తండ్రీ; విషమ = భేద; బుద్ధిన్ = బుద్ధిని; అనంతా = కృష్ణా {అనంతుడు - దేశ కాల వస్తువులచేత మేరలేని వాడు, విష్ణువు}.

భావము:

శాశ్వతుడవైన దేవా! నిజానికి నీవు సర్వ సముడవు. ఎవరిని శత్రువులుగా చూసి కీడు చేయవు. ఎవరిని కావలసినవారుగా చూసి మేలు చేయవు. అలాంటి నీకు ఎందుకయ్య ఇలాంటి భేదబుద్ధి." - రుక్మి శిరోజములు తొలగించిన కృష్ణునితో బలరాముడు ఇలా అన్నాడు.