పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మి యనువాని భంగంబు

  •  
  •  
  •  

10.1-1768-మత్త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నిన్నునీశ్వరు దేవదేవుని నిర్ణయింపఁగ లేక యో
న్నుతామలకీర్తిశోభిత! ర్వలోకశరణ్య! మా
న్న యీతఁడు నేడు చేసె మహాపరాధము నీ యెడన్
న్ను మన్నన చేసి కావు మనాథనాథ! దయానిథీ!

టీకా:

నిన్నున్ = నిన్ను; ఈశ్వరున్ = సర్వనియామకుని; దేవదేవుని = బ్రహాది దేవతలకు దేవుని; నిర్ణయింపగన్ = నిర్ధారించుకొనగ; లేక = లేక; ఓ = ఓయి; సన్నుత = కొనియాడబడిన; అమల = నిర్మలమైన; కీర్తి = యశస్సుచేత; శోభిత = శోభిల్లువాడ; సర్వ = సమస్తమైన; లోక = భువనములకు; శరణ్య = రక్షణనిచ్చువాడ; మా = మా యొక్క; అన్న = సోదరుడు; ఈతడు = ఇతను; నేడు = ఇవాళ; చేసెన్ = చేసెను; మహా = పెద్ద; అపరాధమున్ = తప్పును; నీ = నీ; యెడన్ = అందు; నన్నున్ = నన్ను; మన్నన = మన్నించుట; చేసి = చేసి; కావుము = కాపాడుము; అనాథ = దిక్కులేనివారికి; నాథ = దిక్కయినవాడ; దయానిథీ = దయకు ఉనికి పట్టైనవాడ.

భావము:

"ఓ సత్పురుషులచే కీర్తింపబడేవాడ! సకల లోకాలని కాపాడేవాడా! దిక్కులేని వారికి దిక్కైనవాడ! దయామయా! శ్రీకృష్ణ! వీడు రుక్మి మా అన్న. నిన్ను ఈశ్వరునిగా దేవదేవునిగా గుర్తించలేక చాలా పెద్ద తప్పు చేసాడు. నన్ను మన్నించి వీనిని క్షమించు" అంటు రుక్మిణీదేవి ఇంకా ఇలా విన్నవించసాగింది.