పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వాసుదే వాగమనంబు

  •  
  •  
  •  

10.1-1750-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం, గంఠీరవేంద్రావల
గ్ను, వాంభోజదళాక్షుఁ, జారుతరవక్షున్, మేఘసంకాశదే
హు, గారాతి గజేంద్రహస్త నిభ బాహుం, జక్రిఁ, బీతాంబరున్,
భూషాన్వితుఁ గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్.

టీకా:

కనియెన్ = చూసెను; రుక్మిణి = రుక్మిణీదేవి; చంద్రమండల = చంద్రబింబము వంటి; ముఖున్ = ముఖము కలవానిని; కంఠీరవ = సింహ; ఇంద్ర = శ్రేష్ఠము వంటి; అవలగ్నున్ = నడుము కలవానిని; నవ = సరికొత్త; అంభోజ = తామర; దళ = రేకులవంటి; అక్షున్ = కన్నులు కలవానిని; చారుతర = మిక్కిలి అందమైన {చారు - చారుతరము - చారుతమము}; వక్షున్ = వక్షస్థలము కలవానిని; మేఘ = మేఘములను; సంకాశ = పోలిన; దేహున్ = దేహము కలవానిని; నగారాతిగజేంద్ర = ఐరావతము యొక్క {నగారాతిగజేంద్రము - నగ (పర్వతములకు) ఆరాతి (శత్రువు) ఐన ఇంద్రుని గజశ్రేష్ఠము, ఐరావతము}; హస్త = తొండము; నిభ = వంటి; బాహున్ = చేతులు కలవానిని; చక్రిన్ = చక్రాయుధుని, కృష్ణుని; పీతాంబరున్ = పసుపువన్నె వస్త్రము వాని; ఘన = గొప్ప; భూష = ఆభరణములు; ఆన్వితున్ = కూడినవానిని; కంబు = శంఖము వంటి; కంఠున్ = మెడ కలవానిని; విజయ = జయించుట యందు; ఉత్కంఠున్ = ఉత్కంఠము కలవానిని; జగత్ = లోకములను; మోహనున్ = మోహింపజేయువానిని.

భావము:

రుక్మిణీదేవి కృష్ణుణ్ణి కనుగొంది; అప్పుడు కృష్ణుడు చంద్రమండలం లాంటి మోము, సింహం లాంటి నడుము, నవనవలాడే పద్మదళాల్లాంటి కన్నులు, విశాలమైన వక్షస్థలము, మేఘం లాంటి శరీరవర్ణం, దేవేంద్రుని ఐరావతం యొక్క తొండం లాంటి చేతులు, శంఖం లాంటి మెడ కలిగి ఉన్నాడు; పీతాంబరాలు, గొప్ప భూషణాలు ధరించి ఉన్నాడు; విజయం సాధించాలనే ఉత్సాహంతో సర్వ లోక మనోహరంగా ఉన్నాడు;