పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వాసుదే వాగమనంబు

  •  
  •  
  •  

10.1-1742.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గిలి సఖులు గొల్వఁ ల్లులు బాంధవ
తులు దోడ రాఁగ వినయముగ
గరు వెడలి నడచె గజాతకును మ్రొక్క
బాల చికుర పిహిత ఫాల యగుచు.

టీకా:

సన్నద్ధులు = పోరుటకు సిద్ధపడినవారు; ఐ = అయ్యి; బహు = అనేకమైన; శస్త్ర = శస్త్రములుతో; సమేతులు = కూడినవారు; ఐ = అయ్యి; బలిసి = ఆవరించి; చుట్టును = నాలుగువైపులా; వీర = శూరులైన; భటులు = సైనికులు; కొలువన్ = సేవించుచుండగా; ముందఱన్ = ముందువైపు; ఉపాహారములు = నైవేద్య వస్తువులను; కానుకలు = మొక్కులు; కొంచున్ = తీసుకొని; వర్గంబులు = గుంపులుగ; ఐ = కూడి; వారవనితలు = వేశ్యాస్త్రీలు; ఏగన్ = పోవుచుండగా; పుష్ప = పూలు; గంధ = గంధముపూతలు; అంబర = వస్త్రములు; భూషణ = ఆభకణములు; కలితలు = కలిగినవారు; ఐ = అయ్యి; పాడుచున్ = పాటలు పాడుతు; భూసుర = విప్రుల; భార్యలు = ఇల్లాళ్ళు; అరుగన్ = పోతుండగా; పణవ = తప్పెట్లు, ఉడుకలు; మర్దళ = మద్దెలలు; శంఖ = శంఖములు; పటహ = ఢంకాలు; కాహళ = తుతారలు, బాకాలు; వేణు = పిల్లనగ్రోవులు; భేరీ = పెద్దనగారాలు యొక్క; ధ్వనులన్ = శబ్దములవలన; మిన్ను = ఆకాశము; పిక్కటిలగన్ = నిండిపోగా; తగిలి = కూడా.
సఖులున్ = పరిచారికలు; కొల్వన్ = సేవించుచుండగా; తల్లులున్ = తల్లులు; బాంధవ = బంధువుల; సతులు = స్త్రీలు; తోడన్ = కూడా; రాగ = కూడా వస్తుండగా; సవినయముగన్ = వినయపూర్వకముగా; నగరున్ = అంతఃపురమునుండి; వెడలి = బయలుదేరి; నడచెన్ = వెళ్ళను; నగజాత = పార్వతీదేవి {నగజాత - నగ (పర్వతుని) జాత (పుట్టినామె), పార్వతి}; కున్ = కి; బాల = యువతి; చికుర = ముంగురులచేత; పిహిత = కప్పబడిన; ఫాల = నుదురుకలామె; అగుచున్ = అగుచు.

భావము:

అప్పుడు, రుక్మిణి గౌరీ పూజ చేయడానికి నగరం బయటకి బయలు దేరింది; ఆమె నుదిటి మీద ముంగురులు ఆవరించాయి; సర్వాయుధాలతో సర్వసన్నద్ధంగా ఉన్న శూరులు చుట్టు కొలుస్తున్నారు; వారవనితలు ఫలహారాలు కానుకలు పట్టుకొని వరసలు కట్టి ముందర నడుస్తున్నారు; సర్వాలంకార శోభిత లైన విప్రుల భార్యలు పాటలు పాడుతు వస్తున్నారు; మద్దెలలు, తప్పెట్లు, శంఖాలు, బాకాలు, వేణువులు, భేరీలు మొదలైన మంగళవాయిద్యాల చప్పుళ్ళు మిన్నంటుతున్నాయి; చెలికత్తెలు చేరి కొలుస్తున్నారు; తల్లులు, బంధువులు, అంతఃపుర స్త్రీలు కూడా వస్తున్నారు;