పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వాసుదే వాగమనంబు

  •  
  •  
  •  

10.1-1740-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"గు నీ చక్రి విదర్భరాజసుతకుం; థ్యంబు వైదర్భియుం
గు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య, మీ యిద్దఱిం
గులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా? ర్పాహతారాతియై
గఁడౌఁ గావుతఁ! జక్రి యీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్."

టీకా:

తగున్ = సరిపడును; ఈ = ఈ యొక్క; చక్రి = కృష్ణుడు; విదర్భ = విదర్భ దేశపు; రాజసుత = రాకుమారి; కున్ = కి; తథ్యంబు = నిజముగా; వైదర్భియున్ = రుక్మిణికూడ; తగున్ = సరిపోవును; ఈ = ఈ యొక్క; చక్రి = కృష్ణుని; కిన్ = కి; ఇంతమంచిదగునే = చాలా మంచిది అగును; దాంపత్యము = ఆలుమగలకూడిక; ఈ = ఈ; ఇద్దఱన్ = ఇద్దరిని; తగులంగట్టినన్ = కూర్చినట్టి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; నేర్పరి = మంచినేర్పు గలవాడు కదా; దర్ప = దర్పముచేత; ఆహత = కొట్టబడిన; ఆరాతి = శత్రువులు కలవాడు; ఐ = అయ్యి; మగడు = భర్త; ఔగావుత = అగునుగాక; చక్రి = కృష్ణుడు; ఈ = ఈ; రమణి = ఇంతి; కిన్ = కి; మా = మా యొక్క; పుణ్య = పుణ్యముల; మూలంబునన్ = వలన.

భావము:

“ఈ చక్రాయుధుడైన శ్రీకృష్ణుడు మా విదర్భరాకుమారి రుక్మిణికి తగినవాడు. ఇది సత్యం. ఈమె అతనికి తగినామె. ఈ రుక్మిణీ కృష్ణులు ఒకరికొకరు సరిపోతారు, ఎంత మంచి జంటో. వీరిద్దరిని కూర్చిన బ్రహ్మదేవుడు కడు సమర్థుడే మరి. మా పుణ్యాల ఫలంగా ఈ వాసుదేవుడు పగవారి పీచమణచి మా రుక్మిణిని పెళ్ళాడు గాక.”