పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వాసుదే వాగమనంబు

  •  
  •  
  •  

10.1-1736-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మెచ్చె భవద్గుణోన్నతి; కమేయ ధనావళు లిచ్చె నాకుఁ; దా
చ్చె సుదర్శనాయుధుఁడు వాఁడె; సురాసురు లెల్ల నడ్డమై
చ్చిననైన, రాక్షసవివాహమునం గొనిపోవు నిన్ను; నీ
చ్చరితంబు, భాగ్యమును, ర్వము నేడు ఫలించెఁ గన్యకా!"

టీకా:

మెచ్చెన్ = మెచ్చుకొనెను; భవత్ = నీ యొక్క; గుణ = సుగుణముల; ఉన్నతిన్ = మేలిమి; కిన్ = కి; అమేయ = అంతులేని; ధనా = సంపదల; ఆవళుల్ = సమూహములను; ఇచ్చెన్ = ఇచ్చెను; నా = నా; కున్ = కు; తాన్ = అతను; వచ్చెన్ = వచ్చెను; సుదర్శనాయుధుడు = కృష్ణుడు {సుదర్శ నాయుధుడు - సుదర్శన మను చక్రాయుధము కలవాడు, విష్ణువు, కృష్ణుడు}; వాడె = అతనే; సురాసురులు = దేవదానవులు; ఎల్లన్ = అందరు; అడ్డమై = అడ్డుపడుటకు; ఐ = అయ్యి; వచ్చిననైన = వచ్చినప్పటికి; రాక్షసవివాహమునన్ = రాక్షసవివాహ పద్ధతిని; కొనిపోవు = తీసుకు వెళ్ళును; నినున్ = నిన్ను; నీ = నీ యొక్క; సత్ = మంచి; చరితంబు = వర్తనల; భాగ్యమును = ఫలములు; సర్వమున్ = అంతా; నేడు = ఇవాళ; ఫలించెను = ఫలితముల నిచ్చినవి; కన్యకా = బాలికా.

భావము:

“నీ సుగుణాల్ని మెచ్చుకున్నాడమ్మా. అమ్మాయీ! అంతులేని ధనాన్ని నాకు ఇచ్చాడు. చక్రి తానే స్వయంగా విచ్చేసాడు. దేవదానవు లడ్డమైనా సరే నిన్ను తీసుకు వెళ్తాడు. నీ మంచి తనం అదృష్టం ఇవాళ్టికి ఫలించాయమ్మా.” అని దూతగా వెళ్ళిన విప్రుడు అగ్నిద్యోతనుడు రుక్మిణికి శుభవార్త చెప్పాడు.