పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వాసుదే వాగమన నిర్ణయము

  •  
  •  
  •  

10.1-1725-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లోపల నేకతమున
నాలోలవిశాలనయన గు రుక్మిణి ద
న్నా లోకలోచనుఁడు హరి
యాలోకము చేసి కదియఁ ని శంకితయై.

టీకా:

ఆలోపలన్ = ఆ సమయమునందు; ఏకతమునన్ = ఏకాంతముగ; ఆలోల = చలించెడి; విశాల = పెద్దపెద్ద; నయన = కనులు గలామె; అగు = ఐన; రుక్మిణి = రుక్మిణీదేవి {రుక్మిణి - రుక్మము (బంగారము) కలిగినామె}; తన్నున్ = ఆమెను; ఆ = ఆ ప్రసిద్ధుడైన; లోకలోచనుడు = కృష్ణుడు {లోకలోచనుడు - లోకప్రకాశకులైన సూర్య చంద్రులు కన్నులుగా కలవాడు, విష్ణువు}; హరి = కృష్ణుడు; ఆలోకము = చూసి; కదియడు = సమీపించడు; అని = అని; శంకిత = సంశయము కలది; ఐ = అయ్యి.

భావము:

ఇంతట్లో చలించుతున్న పెద్ద పెద్ద కళ్ళున్న ఆ రుక్మిణీదేవి తనలోతాను తన ఏకాంతమందిరంలో “సూర్యచంద్రులు కన్నులుగా ఉండుట వల్ల లోకాలకు చూసే శక్తిని ఇచ్చేవాడైన కృష్ణుడు ఏకారణంచేతనైనా తన మీద దృష్టిపెట్టి తనను చేరరాడేమో” నని బెంగపెట్టుకుంది. ఇంకా ఇలా అనుకోసాగింది . . .