పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వాసుదే వాగమన నిర్ణయము

  •  
  •  
  •  

10.1-1723-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నానాదేశంబుల రాజు లనేకు లేతెంచి; రందు శిశుపాలు నెదుర్కొని పూజించి భీష్మకుం డొక్కనివేశంబున నతని విడియించె; నంతఁ దద్వృత్తాంతంబు విని.

టీకా:

మఱియున్ = ఇంకను; నానా = పెక్కు; దేశంబుల = దేశములకు చెందిన; రాజులు = ఏలికలు; అనేకులు = అనేకమంది; ఏతెంచిరి = వచ్చిరి; అందున్ = వారిలో; శిశుపాలున్ = శిశుపాలుని; ఎదుర్కొని = ఎదురువెళ్ళి; పూజించి = గౌరవించి; భీష్మకుండు = భీష్మకుడు; ఒక్క = ఒకానొక; నివేశంబునన్ = నివాసమునందు; అతనిన్ = అతనిని; విడియించెన్ = విడిదిలో ఉంచెను; అంతన్ = తరువాత; తత్ = ఆ యొక్క; వృత్తాంతంబు = విషయము; విని = విని.

భావము:

ఇంకా వివిధదేశాలనుండి అనేకమంది రాజులు వచ్చారు. భీష్మకుడు వారిలో శిశుపాలుడికి ఎదుర్కోలు మొదలైన మర్యాదలు చేసి తగిన విడిది ఏర్పాటు చేసాడు. ఈ విషయాలు తెలిసి.