పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వాసుదే వాగమన నిర్ణయము

  •  
  •  
  •  

10.1-1722-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"బంధులఁ గూడి కృష్ణబలద్రులు వచ్చినఁ బాఱదోలి ని
ర్మంర వృత్తిఁ జైద్యునికి మానినిఁ గూర్చెద" మంచు నుల్లస
త్సింధుర వీర రథ్య రథ సేనలతోఁ జనుదెంచి రా జరా
సంధుఁడు దంతవక్త్రుఁడును సాల్వ విదూరక పౌండ్రకాదులున్.

టీకా:

బంధులన్ = బంధువులతో; కూడి = కలిసి; కృష్ణ = కృష్ణుడు; బలభద్రులున్ = బలరాములు; వచ్చినన్ = వచ్చినచో; పాఱదోలి = తరిమి వేసి; నిర్మంథర = త్వరగా పోవు {నిర్మంథరము - మంథరము (మెల్లగా సాగుట) లేకుండునది}; వృత్తిన్ = విధానములో; చైద్యున్ = శిశుపాలుని; కున్ = కి; మానిని = వనితను; కూర్చెదము = కలిపెదము; అంచున్ = అని; ఉల్లసత్ = ఉత్సహించుచున్న; సింధుర = ఏనుగుల; వీర = శూరులైన భటుల; రథ్య = అశ్వ; రథ = రథ; సేనల = సైనికదండు; తోన్ = తోటి; చనుదెంచిరి = వచ్చిరి; ఆ = ఆ యొక్క; జరాసంధుడు = జరాసంధుడు; దంతవక్త్రుడును = దంతవక్త్రుడు; సాల్వ = సాల్వుడు {సాల్వుడు - సాల్వదేశాధీశుడు}; విదూరక = విదూరకుడు; పౌండ్రక = పౌండ్రకవాసుదేవుడు; ఆదులున్ = మొదలగువారు.

భావము:

జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదూరకుడు, పౌండ్రకుడు మొదలైన వాళ్ళంతా “బలరామ కృష్ణులు బంధువు లందరను తోడు తెచ్చుకొని వచ్చినా సరే తరిమేస్తాం. శిశిపాలుడికి బాలికను ఇచ్చి ఏ ఇబ్బంది లేకుండా కట్ట బెడతాం.” అంటూ చతురంగబలాలతో వచ్చారు.