పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వాసుదే వాగమన నిర్ణయము

  •  
  •  
  •  

10.1-1719-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చ్చలు గ్రంతలు రాజమార్గంబులు-
విపణిదేశంబులు విశదములుగఁ
జేసిరి; చందనసిక్త తోయంబులు-
లయంగఁ జల్లిరి; లువడములు
మణీయ వివిధతోణములుఁ గట్టిరి-
కల గృహంబులు క్కఁ జేసి;
ర్పూర కుంకు మారుధూపములు పెట్టి-
తివలుఁ బురుషులు న్ని యెడల

10.1-1719.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వివిధవస్త్రములను వివిధమాల్యాభర
ణానులేపనముల మరి యుండి
ఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి
రుత్సవమున నగర మొప్పియుండె.

టీకా:

రచ్చలు = రథ్యలు, రథబాటలు; క్రంతలు = చిన్నవీధులు, సందులు; రాజమార్గంబులు = ప్రధానమార్గములు; విపణి = వ్యాపార; దేశంబులున్ = ప్రదేశములు; విశదములుగా = శుభ్రపరచినవిగా; చేసిరి = చేసిరి; చందన = మంచిగంధము; సిక్త = కలిపిన; తోయంబులున్ = నీళ్ళు; కలయన్ = అంతటను, కళ్ళాపి; చల్లిరి = చల్లిరి; కలువడములు = కలువలసరములు {కలువడములు - స్తంభమునకు వేలాడదీసిన కలువపూల దండ}; రమణీయ = అందమైన; వివిధ = నానావిధములైన; తోరణములున్ = తోరణములను; కట్టిరి = కట్టిరి; సకల = ఎల్ల; గృహంబులున్ = గృహములను; చక్కజేసి = బాగుపరచి; కర్పూర = పచ్చకర్పూరము; కుంకుమ = కుంకుమపువ్వు; అగరు = అగరుచెక్కల; ధూపములున్ = పొగధూపములను; పెట్టిరి = పట్టించిరి; అతివలు = ఆడవారు; పురుషులున్ = మగవారు; అన్ని = సర్వ; ఎడలన్ = ప్రదేశములందు.
వివిధ = రకరకముల; వస్త్రములను = బట్టలు; వివిధ = అనేకరకములైన; మాల్య = పూదండలు; ఆభరణ = భూషణములు; అనులేపనములన్ = మైపూతలతో; అమరి = అలంకరించుకొని; ఉండిరి = ఉన్నారు; అఖిల = ఎల్ల; వాద్యములున్ = వాయిద్యములను; మహా = మిక్కిలి; ప్రీతిన్ = ప్రేమతో; మ్రోయించిరి = వాయించిరి; ఉత్సవమునన్ = వేడుకలతో; నగరము = పట్టణము; ఒప్పి = చక్కగానై; ఉండె = ఉండెను.

భావము:

ఆ కుండిన నగర మంతా ఉత్సాహంతో వెలిగిపోతోంది. వీధులు, సందులు, రాజమార్గాలు, బజార్లు అన్ని శుభ్రం చేసారు. మంచి గంధం కలిపిన నీళ్ళు కళ్ళాపి జల్లారు. కలువపూల దండలు మనోహరమైన తోరణాలు కట్టారు. నగరంలోని ఇళ్ళన్ని శుభ్ర పరచారు. సుగంధ ధూపాలు పట్టారు. ప్రతిచోట రకరకాల పూలు, బట్టలు, అలంకారాలు స్త్రీ పురుషులు ధరించారు. ప్రజలు సంతోషంతో మంగళ వాద్యాలు అన్నిటిని గట్టిగా వాయిస్తున్నారు.