పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వాసుదే వాగమన నిర్ణయము

  •  
  •  
  •  

10.1-1716-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"న్నియమీఁద నా తలఁపు గాఢము; కూరుకురాదు రేయి నా
కెన్నఁడు; నా వివాహము సహింపక రుక్మి దలంచు కీడు నే
మున్నె యెఱుంగుదున్; బరులమూఁక లడంచి కుమారిఁ దెత్తు వి
ద్వన్నుత! మ్రానుఁ ద్రచ్చి నవహ్నిశిఖన్ వడిఁదెచ్చు కైవడిన్.

టీకా:

కన్నియ = కన్యక; మీదన్ = పైన; నా = నా యొక్క; తలపు =కోరిక; గాఢము = దృఢముగా నున్నది; కూరుకు = నిద్ర; రాదు = రాదు; రేయి = రాత్రు లందు; నా = నా; కున్ = కు; ఎన్నడున్ = ఎప్పుడు; నా = నా తోడి; వివాహమున్ = పెండ్లిని; సహింపక = ఓర్వజాలక; రుక్మి = రుక్మి; తలంచున్ = తలపెట్టును; కీడు = చెరుపును; నేన్ = నేను; మున్న = ముందుగనే; ఎఱుంగుదున్ = తెలిసియుంటిని; పరుల = శత్రువుల; మూక = సమూహమును; వధించి = చంపి; కుమారిన్ = కన్యకను; తెత్తున్ = తీసుకు వచ్చెదను; విద్వన్ = విద్వాంసులచేత; నుత = పొగడబడువాడ; మ్రానున్ = కఱ్ఱను; త్రచ్చి = మథించి; నవ = కొత్త; వహ్ని = అగ్ని; శిఖన్ = మంటను; వడిన్ = వేగముగా; తెచ్చు = తీసుకు వచ్చెడి; కైవడిన్ = విధముగ.

భావము:

“విద్వాంసుల ప్రసంశలు గైకొన్న బ్రాహ్మణోత్తమా ! రుక్మిణిపై నాకు గాఢానురక్తి  గలదు. ఆమెపైన  తలపులవలన నాకు నిద్ర  రాదు. ఆమెతో నా వివాహము నోర్చని రుక్మి యొక్క దురాలోచనలు నాకు తెలుసు. శత్రుమూకల నణచి , కట్టెను మథించి దీపశిఖను తెచ్చునట్లు ఆమెను నేను తీసుకువస్తాను.