పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వాసుదే వాగమన నిర్ణయము

  •  
  •  
  •  

10.1-1715-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు పలికిన బ్రాహ్మణునివలన విదర్భరాజతనయ పుత్తెంచిన సందేశంబును, రూప సౌందర్యాదివిశేషంబులును విని, యవధరించి నిజకరంబున నతని కరంబుఁబట్టి నగుచు న య్యాదవేంద్రుం; డిట్లనియె

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలికిన = చెప్పిన; బ్రాహ్మణుని = విప్రుని; వలన = వలన; విదర్భరాజతనయ = రుక్మిణీదేవి {విదర్భ రాజ తనయ - విదర్భరాజు (భీష్మకుడు) యొక్క పుత్రిక, రుక్మిణి}; పుత్తెంచిన = పంపించిన; సందేశంబున్ = సమాచారము; రూప = చక్కదనము; సౌందర్య = అందము; ఆది = మున్నగు; విశేషంబులున్ = విశిష్టతలను; విని = విని; అవధరించి = సమ్మతించి; నిజ = తన యొక్క; కరంబునన్ = చేతితో; అతని = అతని యొక్క; కరంబున్ = చేతిని; పట్టి = పట్టుకొని; నగుచున్ = నవ్వుతు; ఆ = ఆ యొక్క; యాదవేంద్రుండు = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా పలికిన బ్రాహ్మణుడి ద్వారా రుక్మిణి పంపిన సందేశం, ఆమె చక్కదనాలు అవి గ్రహించి, శ్రీకృష్ణుడు అతని చేతులో చేయ్యేసి నవ్వుతూ ఇలా అన్నాడు.