పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మిణి సందేశము పంపుట

  •  
  •  
  •  

10.1-1714-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యెలనాగ నీకుఁ దగు; నంగనకుం దగు దీవు మా యుపా
ధ్యాయుల యాన పెండ్లి యగుఁ; ప్పదు జాడ్యములేల? నీవు నీ
తోమువారిఁ గూడుకొని తోయరుహాననఁ దెత్తుగాని వి
చ్చేయుము; శత్రులన్ నుఱుముజేయుము; చేయుము శోభనం బిలన్."

టీకా:

ఆ = ఆ యొక్క; ఎలనాగ = యువతి {ఎలనాగ - లేత వయస్కురాలు, వనిత}; నీకున్ = నీకు; తగున్ = సరిపడును; అంగన = వనిత {అంగన - మంచి అంగములు కలామె, స్త్రీ}; కున్ = కు; తగుదువు = సరిపడుదువు; ఈవు = నీవు; మా = మా యొక్క; ఉపాధ్యాయుల = గురువుల మీద; ఆన = ఒట్టు; పెండ్లి = వివాహము; అగున్ = జరుగును; తప్పదు = తథ్యమిది; జాడ్యములు = ఆలసించుటలు; ఏలన్ = ఎందుకు; నీవున్ = నీవు; నీ = నీ యొక్క; తోయమువారిన్ = సేనతో; కూడుకొని = కలిసి; తోయరుహాననన్ = పద్మాక్షిని; తెత్తుగాని = తీసుకువచ్చెదవుగాని; విచ్చేయుము = రమ్ము; శత్రులన్ = విరోధులను; నుఱుము = పొడిగా, మర్ధించుట; చేయుము = చేయుము; చేయుము = చేయుము; శోభనంబు = శుభములను; ఇలన్ = లోకమునకు.

భావము:

ఆ యువతి రుక్మణీదేవి నీకు తగినది. ఆమెకు వాసుదేవ! నీవు తగిన వాడవు. మా గురువులము ఇస్తున్న ఆనతి ఇది. మీ పెళ్ళి జరిగి తీరుతుంది. ఇంక ఆలస్యం ఎందుకు. నువ్వు నీ సేనతో కలిసి కన్యను తీసుకొచ్చెదవుగాని రమ్ము. శత్రువుల్ని నుగ్గునుగ్గుచేయుము. లోకానికి శుభాలు కలిగించుము.”