పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మిణి సందేశము పంపుట

  •  
  •  
  •  

10.1-1712-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు రుక్మిణీదేవి పుత్తెంచిన సందేశంబును, రూప సౌంద ర్యాది విశేషంబులును బ్రాహ్మణుండు హరికి విన్నవించి “కర్తవ్యం బెద్ది చేయ నవధరింపు” మని సవర్ణనంబుగా మఱియు నిట్లనియె.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి; పుత్తెంచిన = చెప్పి పంపించిన; సందేశంబులున్ = వృత్తాంతములు; రూప = రూపము నందలి; సౌందర్య = అందము; ఆది = మున్నగు; విశేషంబులున్ = ప్రత్యేకతలను; బ్రాహ్మణుండు = విప్రుడు; హరి = కృష్ణుని; కిన్ = కి; విన్నవించి = చెప్పి; కర్తవ్యంబు = చేయదగ్గపని; ఎద్ది = ఏదైతే అది; చేయన్ = చేయవలెనని; అవధరింపుము = నిశ్చయించుకొనుము; అని = అని; సవర్ణనంబుగాన్ = రుక్మిణి సౌందర్య వర్ణనల సహితముగా; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా శ్రీకృష్ణునికి బ్రాహ్మణుడు రుక్మిణీదేవి పంపిన సందేశం, ఆమె అందచందాది విశేషాలు వివరంగా చెప్పి “ఏం చేయాలో చూడు” అని విన్నవించి, కుండిన పుత్రిని వర్ణిస్తూ ఇంకా ఇలా చెప్పాడు . .