పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మిణి సందేశము పంపుట

  •  
  •  
  •  

10.1-1705-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్యున్ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ
న్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే
న్యల్గోరరు? కోరదే మును రమాకాంతా లలామంబు రా
న్యానేకపసింహ! నా వలననే న్మించెనే మోహముల్?

టీకా:

ధన్యున్ = కృతార్థుండు; లోక = లోకుల; మనః = మనసులను; అభిరామున్ = నచ్చువాడు; కుల = వంశముచేత; విద్యా = విజ్ఞానముచేత; రూప = సౌందర్యముచేత; తారుణ్య = యౌవనశోభచేత; సౌజన్య = మంచితనముచేత; శ్రీ = సంపదలచేత; బల = శక్తిచేత; దాన = ఈవిచేత; శౌర్య = వీరత్వముచేత; కరుణా = దయచేత; సంశోభితున్ = మిక్కిలి ప్రకాశవంతుడు; నిన్నున్ = నిన్ను; ఏ = ఏ; కన్యల్ = కన్యలు మాత్రము; కోరరు = కావలనుకొనరు; కోరదే = వరించలేదా; మును = పూర్వము; రమా = లక్ష్మీదేవి యనెడి; కాంతాలలామంబు = శ్రేష్ఠురాలు; రాజ = రాజులలో; అన్య = శత్రువు లనెడి; అనేకప = ఏనుగులకు; సింహ = సింహమువంటివాడ; నా = నా ఒక్కర్తె; వలననే = యందే; జన్మించెనే = పుట్టినవా, పుట్టలేదు; మోహముల్ = మోహించుటలు.

భావము:

ముకుందా! రాజులనే మత్తేభాల పాలిటి సింహమా! నీవు ధన్యుడవు. అందరి మనసులు అలరించే వాడవు. కులం, రూపం, యౌవనం, సౌజన్యం, శ్రీ, బలం, దాన, పరాక్రమం, కరుణాది సకల సుగుణ సంశోభితుడవు. అలాంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉంటారు. మోహించకుండా ఉంటారు. పూర్వం కాంతామణి లక్ష్మీదేవి నిన్ను వరించ లేదా. అయినా లోకంలో రుక్మిణి అనబడే నా ఒక్కదాని వలననే మోహం అనేది పుట్టిందా ఏమిటి.