పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మిణి సందేశము పంపుట

  •  
  •  
  •  

10.1-1701-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"గతీసురేశ్వర! సంతోషచిత్తుండ-
వై యున్న నీ ధర్మ తిసులభము
వృద్ధసమ్మత మిది విత్త మెయ్యది యైనఁ-
బ్రాపింప హర్షించు బ్రాహ్మణుండు
న ధర్మమున నుండుఁ రలఁ డా ధర్మంబు-
గోరిక లతనికిఁ గురియుచుండు
సంతోషిగాఁ డేని క్రుఁడైన నశించు-
నిర్ధనుండైనను నింద్రుఁ బోఁలు

10.1-1701.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సంతసించెనేని, ర్వభూతసుహృత్త
ములకుఁ బ్రాప్తలాభ ముదిత మాన
సులకు శాంతులకును సుజనులకును గర్వ
హీనులకును వినతు లే నొనర్తు.

టీకా:

జగతీసుర = విప్రులలో {జగతీసురుడు - భూలోకమునకు దేవుడు, బ్రాహ్మణుడు}; ఈశ్వరా = శ్రేష్ఠుడా; సంతోష = సంతోషముతోకూడిన; చిత్తుండవు = మనసు కలవాడవు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; నీ = నీ యొక్క; ధర్మము = స్వభావము; అతి = మిక్కిలి; సులభము = ఆమోదయోగ్యమైనది; వృద్ధ = పెద్దలచే; సమ్మతము = అంగీకరింపబడినది; ఇది = ఇది; విత్తము = ధనము; ఎయ్యది = ఏది; ఐనన్ = అయినప్పటికి; ప్రాప్తింపన్ = లభించినచో; హర్షించున్ = సంతోషించును; బ్రాహ్మణుండున్ = విప్రుడు; తన = అతని యొక్క, స్వ; ధర్మమునన్ = ధర్మమునందే; ఉండున్ = నిలుకడగా ఉండును; తరలడు = తప్పుకొనడు; ధర్మంబున్ = స్వధర్మమును; కోరికలు = కోరినవి; అతని = అతని; కిన్ = కి; కురియుచున్ = సమృద్ధిగా దొరకుచు; ఉండున్ = ఉండును; సంతోషి = సంతోషించినవాడు; కాడేని = కానిపక్షమున; శక్రుడు = ఇంద్రుడు; ఐనన్ = అయినను; నశించున్ = నశించిపోవును; నిర్దనుండు = మిక్కిలి బీదవాడు; ఐననున్ = అయినను; ఇంద్రుబోలు = దేవేంద్రుని వలె భోగము లనుభవించును;
సంతసించెనేని = సంతోషించినచో; సర్వ = సమస్తమైన; భూత = ప్రాణులకు; సుహృత్తముల్ = మేలు కోరువారల; కున్ = కు; ప్రాప్త = పొందబడిన; లాభ = లాభములచేతనే; ముదిత = సంతోషించునట్టి; మానసుల్ = మనసులు కలవారి; కున్ = కు; శాంతుల్ = శాంతస్వభావము కలవారి; కును = కి; సుజనుల్ = మంచివారి; కును = కి; గర్వ = గర్వము; హీనుల్ = లేనివారి; కును = కి; వినతులు = నమస్కారములు; ఏన్ = నేను; ఒనర్తు = చేయుదును.

భావము:

“ఓ బ్రాహ్మణుడా! లోకులందరిచే గౌరవింపబడువాడ! నీ పద్దతి చక్కటిది, తీరైనది, పెద్దలు అంగీకరించేది. బ్రాహ్మణుడు దొరికిన ధనంతోనే తృప్తిపడతాడు. తన దర్మాన్ని వదలిపెట్టడు. ఆ ధర్మమే అతనికి కావలసినవన్నీ సమకూరుస్తుంది. విప్రుడు తృప్తి చెందకపోతే ఇంద్రుడైనా నాశనమైపోతాడు. తృప్తి చెందాడా, దరిద్రుడు కూడ దేవేంద్రుని వలె భోగాలను అనుభవిస్తాడు. నేను సకల జీవులకు ఆప్తులు, దొరికిన దానితోనే తృప్తిచెందే వారు, శాంతస్వభావులు, మంచివారు, గర్వహీనులు అయిన విప్రులకి నమస్కరిస్తాను.