పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మిణీ జననంబు

  •  
  •  
  •  

10.1-1690-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు-
బలలతోడ వియ్యంబు లందు;
గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి-
చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి;
మణీయ మందిరారామ దేశంబులఁ-
బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు;
దమల మణిమయ సౌధభాగంబుల-
లీలతో భర్మడోలికల నూఁగు;

10.1-1690.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాలికలతోడఁ జెలరేగి బంతు లాడు;
శారికా కీర పంక్తికిఁ దువు సెప్పు;
ర్హి సంఘములకు మురిములు గఱపు;;
దమరాళంబులకుఁ జూపు మందగతులు.

టీకా:

పేర్వేరన్ = పేరుపేరున; బొమ్మల = ఆయా బొమ్మలకు; పెండ్లిండ్లు = పెళ్ళిళ్ళు; చేయుచున్ = చేస్తూ; అబలల = బాలికల; తోడన్ = తోటి; వియ్యంబులు = సంబంధములు; అందున్ = చేయును; గుజ్జెనగూళులున్ = గుజ్జెనగూళ్ళు {గుజ్జెనగూళ్ళు - పిల్లలు ఆటలందు చిన్నచిన్న గిన్నెలలో తయారుచేసుకొను ఆహారపదార్థములు}; కొమరొప్ప = చక్కగా; వండించి = తయారుచేయించి; చెలుల్ = స్నేహితుల; కున్ = కు; పెట్టించున్ = పెట్టించును; చెలువు = చక్కదనములు; మెఱసి = పెంపొందగా; రమణీయ = అందమైన; మందిర = గృహములందలి; ఆరామ = ఉద్యానవనములోని; దేశంబులన్ = ప్రదేశములందు; పువ్వుతీగెల్ = పూలతీవల; కున్ = కు; ప్రోది = పోషించుట, మొక్కలకు కట్టు గొప్పులు; చేయున్ = చేయును; సదమల = మిక్కిలి నిర్మలమైన; మణి = రత్నాలు; మయ = పొదిగిన; సౌధ = మేడలపై (డాబాల); భాగంబులన్ = భాగముల; లీల = విలాసముల; తోన్ = తోటి; భర్మ = బంగారు; డోలికలన్ = ఊయలలందు; ఊగున్ = ఊగును.
బాలికల = బాలల; తోడన్ = తోటి; చెలరేగి = విజృంభించి; బంతులు = బంతులాటలు; ఆడున్ = ఆడును; శారికా = గోరువంకల; కీర = చిలుకల; పంక్తి = సమూహముల; కిన్ = కు; చదువున్ = పలుకులు పలుకుట; చెప్పున్ = చెప్పును; బర్హి = నెమళ్ళ; సంఘముల్ = సమూహముల; కున్ = కు; మురిపెములున్ = నడకల వయ్యారములు; కరపున్ = నేర్పును; మద = మదించిన; మరాళంబుల్ = హంసల; కున్ = కు; చూపున్ = నేర్పును; మంద = మెల్లని; గతులు = నడకలు.

భావము:

బొమ్మల పెళ్ళిళ్ళు చక్కగా చేసి చెలికత్తెలతో వియ్యాలందే ఆటలాడుతోంది. గుజ్జెన గూళ్లు వండించి పెడుతోంది. అందమైన తోటల్లో పూతీగెలకి గొప్పులు కడుతోంది. సౌధాలలో బంగారపు టుయ్యాలలు ఊగుతోంది. చెలులతో బంతులాట లాడుతోంది. చిలక పలుకులు, నెమలి మురిపాలు, మదగజాల మందగతులతో అతిశయిస్తోంది,
ప్రజల నాలుకలపై నానుతుండే ఒక వృత్తాంతము చూద్దాము. పోతన గారు ఈ పద్యం వ్రాస్తూ, “బాల కమరె” వరకు వ్రాసారుట. అదే సమయంలో వారి , ఇంట్లో ఆడుకుంటున్న చిన్నపిల్ల, నిప్పులపై పడిందిట. జుట్టు కాలుతుందని అందరూ కంగారు పడుతున్నారట. (కమర అంటే కాలు అనే అర్థం ఉంది కదా.) ఇంతలో, ఇదేమీ తెలియని పోతనగారు తన సహజధోరణిలో “బద్మనయను వలనఁ బ్రమదంబు నిండార నెలఁత యౌవనంబు నిండి యుండె”. అని పూరించగానే ఏ ఇబ్బంది లేకుండ పిల్ల నిప్పులనుంచి బయటపడిందట.