పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ప్రవర్షణ పర్వ తారోహణంబు

  •  
  •  
  •  

10.1-1679-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు శత్రువుల వంచించి యాదవేంద్రులు సముద్రపరిఖంబైన ద్వారకానగరంబునకుం జనిరి; జరాసంధుండు వారలు దగ్ధులై రని తలంచుచు బలంబులుం దానును మగధదేశంబునకు మరలి చనియె” నని చెప్పి శుకుండు వెండియు నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; శత్రువుల = విరోధి సైన్యమును; వంచించి = మోసగించి; యాదవేంద్రులున్ = రామకృష్ణులు {యాదవేంద్రులు - యదు వంశపు ప్రభువులు, బలరాముడు కృష్ణుడు}; సముద్ర = సముద్రము; పరిఖంబు = అగడ్తగా కలిగినది; ఐన = అయిన; ద్వారకా = ద్వారక అనెడి; నగరంబున్ = పట్టణమునకు; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; జరాసంధుండున్ = జరాసంధుడు కూడ; వారలు = వారు; దగ్ధులు = కాలిపోయినవారు; ఐరి = అయితిరి; అని = అని; తలంచుచు = భావిస్తూ; బలంబులున్ = సైన్యములును; తానును = అతను; మగధదేశంబున్ = మగధదేశమున; కున్ = కు; మరలి = వెనుతిరిగి; చనియెన్ = వెళ్ళిపోయెను; అని = అని; చెప్పి = చెప్పి; శుకుండు = శుకుడు; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈలాగున విరోధుల కనుగప్పి యదుకుల విభులైన రామకృష్ణులు సాగరమే అగడ్తగా కలిగిన తమ ద్వారకాపురికి చేరుకున్నారు. జరాసంధుడు వారు కాలిపోయారని భావించి తన సేనలతో మగధదేశానికి వెనుదిరిగి వెళ్ళిపోయాడు.