పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ప్రవర్షణ పర్వ తారోహణంబు

  •  
  •  
  •  

10.1-1675-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు జరాసంధపరిజన ప్రదీపితంబైన మహానలంబు దరికొనియె; నందు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; జరాసంధ = జరాసంధుని; పరిజన = సేవకులచే; ప్రదీపితంబు = రాజేయబడినది; ఐన = అయిన; మహా = గొప్ప; అనలంబు = అగ్ని; తరికొనియెన్ = రగుల్కొనెను; అందు = దానిలో.

భావము:

ఈ విధంగా జరాసంధుని భృత్యులు ముట్టించిన మహాగ్ని రగులుకొని ఆ పర్వతాన్ని కాల్చివేసింది.