పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ప్రవర్షణ పర్వ తారోహణంబు

  •  
  •  
  •  

10.1-1673-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుం బలాయమానులై బహుయోజనంబుల దూరంబు చని విశ్రాంతులై తమకు డాఁగ నెల వగునని యింద్రుండు మిక్కిలి వర్షింపఁ "బ్రవర్షణా"ఖ్యంబై పదునొకండు యోజనంబుల పొడవును నంతియ వెడలుపునుం గల గిరి యెక్కి రంత.

టీకా:

మఱియున్ = తరువాత; పలాయమానులు = పారిపోవుచున్నవారు; ఐ = అయ్యి; బహు = అనేక; యోజనంబుల = యోజనముల; దూరంబున్ = దూరము; చని = వెళ్ళి; విశ్రాంతులు = అలసినవారు; ఐ = అయ్యి; తమ = వారల; కున్ = కు; డాగ = దాగుకొనుటకు; నెలవు = అనువగుచోటు; అని = అని; ఇంద్రుండు = ఇంద్రుడు; మిక్కిలి = అధికముగా; వర్షింపన్ = వానకురిపించుచేత; ప్రవర్షణ = ప్రవర్షణ అనెడి; ఆఖ్యంబు = పేరుపొందినది; ఐ = అయి; పదునొకండు = పదకొండు (11); యోజనంబుల = యోజనముల కొలతగల; పొడవును = పొడుగు; అంతియన్ = అంతే; వెడలుపునున్ = వెడల్పు; కల = కలిగిన; గిరిన్ = కొండను; ఎక్కిరి = ఎక్కిరి; అంత = అటుపిమ్మట.

భావము:

రామకృష్ణులు పరుగెత్తి పరుగెత్తి పెక్కు ఆమడల దూరం వెళ్ళి సేదతీర్చుకోవడానికి దాగుకోడానికి తగిన చోటని తలచి దేవేంద్రుడు అధికంగా వానలు కురిపించడం చేత ప్రవర్షమనే పేరువహించి పదకొండు ఆమడల పొడవు అంతే వెడల్పు కల ఒక పర్వతాన్ని ఎక్కారు.