పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : జరసంధుడు గ్రమ్మర విడియుట

  •  
  •  
  •  

10.1-1669.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్రురాజ ప్రతాపాగ్ని శాంతముగను
వృష్టికాలము వచ్చు న వ్విధముఁ దోఁప
నేగుదెంచె జరాసంధుఁ డిరువదియును
మూడు నక్షౌహిణులు దన్ను మొనసి కొలువ.

టీకా:

ఘోటక = గుఱ్ఱముల; సంఘాత = సమూహము యొక్క; ఖుర = గిట్టలచే; సమ = మిక్కిలి; ఉత్ = పైకి; నిర్గత = లేస్తున్న; ధూళి = దుమ్ము; జీమూత = మేఘముల; సందోహము = సమూహము; కను = అయినట్లు; మహనీయ = మిక్కిలిగొప్పవైన; మదకల = మదపుటేనుగు యొక్క; మాతంగకట = ఏనుగుచెక్కిళ్ళు లందలి; దాన = మదజలపు; ధారలు = కారెడి ధారలు; కీలాల = జల; ధారలు = ధారలు; కనున్ = అయినట్లు; నిరుపమ = సాటిలేని; స్యందన = రథముల; నేమి = చక్రపుకమ్ముల యొక్క; నిర్ఘోషంబు = గట్టిధ్వని; దారుణ = భయంకరమైన; గర్జిత = ఉరుముల; ధ్వానము = చప్పుళ్ళు; కను = అయినట్లు; నిశిత = వాడి యైన; శస్త్ర = శస్త్రముల యొక్క; అస్త్ర = అస్త్రముల యొక్క; మానిత = మనోజ్ఞమైన; దీర్ఘ = అధికమైన; రోచులు = కాంతులు; లలిత = మనోజ్ఞమైన; సౌదమినీ = మెరుపు; లతికలు = తీగలు; కను = అయినట్లు.
శత్రు = విరోధి; రాజ = రాజుల; ప్రతాప = ప్రతాపము అనెడి; అగ్ని = అగ్ని; శాంతము = చల్లార్చునవి; కను = అయినట్లు; వృష్టికాలము = వానాకాలము; వచ్చు = వచ్చెడి; విధమునన్ = విధము; తోపన్ = కనబడునట్లు; ఏగుదెంచె = వచ్చెను; జరాసంధుడు = జరాసంధుడు; ఇరువదియునుమూడున్ = ఇరవైమూడు; అక్షౌహిణులు = అక్షౌహిణుల సేన; తన్ను = అతనిని; మొనసి = పూని; కొలువన్ = సేవించుచుండగా.

భావము:

జరాసంధుడు ఇరవైమూడు అక్షౌహిణుల సేనతో మథుర మీదకి దండెత్తి వచ్చాడు; అతడి గుఱ్ఱాల గుంపుల డెక్కల వలన రేగిన దుమ్ము మబ్బుల గుంపులా ఉంది; బాగా పెద్దవైన మదపుటేనుగుల చెక్కిళ్ళనుండి స్రవించే మదజలధారలు వర్షజలధారలను మించాయి; కదిలే రథచక్రాల రొద ఘోరమైన ఉరుముల మ్రోతలా అనిపించింది; వాడి శస్త్రాస్త్రాల పెనుకాంతులు మెరిసే మెఱుపుతీగలను పోలాయి; శత్రురాజుల శౌర్యాగ్నిని చల్లార్చే వర్షాకాలం మాదిరి అతడి సైన్యం గోచరించింది;