పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పరీక్షిత్తు కృష్ణలీల లడుగుట

  •  
  •  
  •  

10.1-4-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శీముగల యదుకులమున
నేలా పుట్టెను మహాత్ముఁ డీశుఁడు విష్ణుం?
డే లీల మెలఁగె? నెయ్యే
వేల నే మేమి చేసె? వివరింపు తగన్.

టీకా:

శీలము = మంచి నడవడిక; కల = కలిగినట్టి; యదు = యాదవ; కులమునన్ = వంశము నందు; ఏలా = ఎందుచేత; పుట్టెను = అవతరించెను; మహాత్ముడు = నారాయణుడు {మహాత్ముడు - ముల్లోకములు ఆత్ముడు (తానైనవాడు), విష్ణువు}; ఈశుడు = నారాయణుడు {ఈశుడు - సృష్టి స్థితి లయ తిరోధానానుగ్రహములు అనెడి పంచకృత్యములు చేయు ప్రభువు, విష్ణుడు}; విష్ణుండు = నారాయణుడు {విష్ణుండు - సృష్టికి లోపల బయట నిండి (వ్యాపించి) ఉన్నవాడు, హరి}; ఏ = ఏ; లీలన్ = విధముగా; మెలగెన్ = వర్తించెను; ఎయ్యే = ఏయే; వేళలన్ = సమయములలో; ఏమేమి = ఏయే పనులు; చేసెన్ = ఆచరించెను; వివరింపు = వివరముగ చెప్పు; తగన్ = చక్కగ.

భావము:

శ్రీమహా విష్ణువు మహాత్ముడూ, ఈ లోకాలకు ఈశ్వరుడూ. ఆయన శీలవంతమైన యదువంశంలో ఎందుకు పుట్టాడు. అలా పుట్టి ఏవిధంగా ప్రవర్తించాడు. ఏ ఏ వేళల్లో ఏమేమి పనులు చేసాడు. ఈ విషయా లన్నీ వివరంగా చెప్పవలసింది.