పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పరీక్షిత్తు కృష్ణలీల లడుగుట

  •  
  •  
  •  

10.1-17-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రపంచ మెల్ల నే మాయచే మోహి
తాత్మ యగుచు నుండు; ట్టిమాయ
మలనాభు నాజ్ఞఁ గార్యార్థమై, నిజాం
శంబు తోడఁ బుట్టు గతి యందు."

టీకా:

ఈ = ఈ; ప్రపంచము = లోకము అందలి ప్రజలు; ఎల్లనున్ = అందరును; ఏ = ఏ విధమైనట్టి; మాయ = మాయ యొక్క ప్రభావము; చేన్ = చేత; మోహిత = మోహింపపడిన; ఆత్మ = మనసు కలవారు; అగుచుండున్ = ఐపోతూ ఉండునో; అట్టి = అటువంటి; మాయన్ = మాయ; కమలనాభున్ = విష్ణుని యొక్క {కమలనాభుడు - పద్మనాభుడు, విష్ణువు}; ఆజ్ఞన్ = ఆజ్ఞ ప్రకారము; కార్యార్థము = ఒక పని కోసము; నిజ = తన; అంశంబున్ = కళతో; పుట్టున్ = జన్మించును; జగతిన్ = భూలోకము; అందున్ = లో.

భావము:

ఈ ప్రపంచం అంతా యోగమాయ యొక్క మాయ చేత మోహం చెందుతూ ఉంటుంది. ఆ యోగమాయ విష్ణువు ఆజ్ఞ ప్రకారం తన అంశతో కార్యనిర్వహణ కోసం భూమిపైన జన్మిస్తుంది.”