పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ముచికుందుడు స్తుతించుట

  •  
  •  
  •  

10.1-1667-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చ్ఛిద్రప్రకట ప్రతాపరవిచే నాశాంతరాళంబులంన్
బ్రచ్ఛాదించుచుఁ గ్రమ్మఱన్ మథురకుం ద్మాక్షుఁ డేతెంచి వీ
డాచ్ఛాదించి మహానిరోధముగఁ జక్రాకారమై యున్న యా
మ్లేచ్ఛవ్రాతము నెల్లఁ ద్రుంచె రణభూమిం బెంపు సొంపారఁగన్.

టీకా:

అచ్ఛిద్ర = ఎడతెగని; ప్రకట = ప్రసిద్ధమైన; ప్రతాప = తేజస్సు అనెడి; రవి = సూర్యునిచే; చేన్ = చేత; ఆశా = దిక్కుల; అంతరాళంబులన్ = అంతములవరకు; ప్రచ్ఛాదించుచున్ = చక్కగా కప్పుచు; క్రమ్మఱన్ = మరల; మథుర = మథురాపట్టణమున; కున్ = కు; పద్మాక్షుడు = కృష్ణుడు; ఏతెంచి = వచ్చి; వీడున్ = పట్టణమును; ఆచ్ఛాదించి = కమ్ముకొని; మహా = మిక్కిలి; నిరోధము = నిర్బంధము; కన్ = అగునట్లు; చక్రాకారము = చక్రవ్యూహముగా; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; ఆ = ఆ యొక్క; మ్లేచ్ఛ = తురుష్కుల; వ్రాతమున్ = సమూహమును; ఎల్లన్ = అంతటిని; త్రుంచెన్ = సంహరించెను; రణభూమిన్ = యుద్ధక్షేత్రము నందు; పెంపు = గొప్పదనము; సోంపారగన్ = చక్కగా కనబడునట్లుగా.

భావము:

అలా ముచుకుందుడిని పంపిన, పద్మముల వంటి కన్నులు కల శ్రీకృష్ణుడు లోపం లేని ప్రతాపమనే భానుతేజంతో దిగంతరాలను కప్పివేస్తూ మరల మథురానగరానికి విచ్చేసాడు. అతడు పట్టణము అంతటినీ చక్రాకారంతో ఆవరించి ముట్టడించి ఉన్న యవనులు అందరినీ యుద్ధభూమిలో గొప్పదనం అతిశయించేలా నిర్మూలించాడు.