పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ముచికుందుడు స్తుతించుట

  •  
  •  
  •  

10.1-1663-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సంసారి యై యున్న నునకు నీశ్వర!-
నీ కృప యెప్పుడు నెఱయఁ గల్గు
ప్పుడ బంధంబు న్నియుఁ దెగిపోవు-
బంధమోక్షంబైనఁ బ్రాప్త మగును
త్సంగమంబు; సత్సంగమంబున నీదు-
క్తి సిద్ధించు; నీ క్తివలన
న్ముక్తి యగు; నాకు త్సంగమునకంటె-
మును రాజ్యబంధ నిర్మూలనంబు

10.1-1663.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లిగినది దేవ! నీ యనుగ్రహము గాదె?
కృష్ణ! నీ సేవగాని తక్కినవి వలదు;
ముక్తి సంధాయి వగు నిన్ను ముట్టఁ గొలిచి
యాత్మబంధంబు గోరునే యార్యుఁ డెందు?

టీకా:

సంసారి = కుటుంబీకుడు, గృహస్తు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; జనున్ = వాని; కున్ = కి; ఈశ్వర = భగవంతుడా; నీ = నీ యొక్క; కృప = దయ; ఎప్పుడున్ = ఎప్పుడైతే; నెఱయన్ = పూర్ణముగా; కల్గున్ = లభించునో; అప్పుడ = అప్పుడే; బంధంబులు = సంసారబంధములు; అన్నియున్ = అన్నీ; తెగిపోవున్ = తెగిపోవును; బంధ = తగులములనుండి; మోక్షంబు = విముక్తి; ఐనన్ = జరిగినచో; ప్రాప్తము = లభించుట; అగును = జరుగును; సత్సంగమంబు = సత్పురుషులతో కూడిక; సత్సంగమంబునన్ = సత్పురుషసహవాసంతో; నీదు = నీమీది; భక్తి = భక్తి; సిద్ధించున్ = కలుగును; నీ = నీమీది; భక్తి = భక్తి; వలన = వలన; సత్ = సత్యమైనట్టి {సన్ముక్తి - మోక్షము, శ్లో. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః....భజగోవిందం... (ఆదిశంకరాచార్యులవారు)}; ముక్తి = మోక్షము; అగున్ = కలుగును; నా = నా; కున్ = కు; సత్సంగమున్ = సత్పురుషసాంగత్యము; కంటెన్ = కంటె; మును = ముందుగా; రాజ్య = రాజ్యాధికార; బంధ = తగులము యొక్క; నిర్మూలనంబు = మూలమునుండిపోవుట; కలిగినది = కలుగుట.
దేవ = భగవంతుడా; నీ = నీ యొక్క; అనుగ్రహము = దయచూపుటచేత; కాదె = కాదా, అవును; కృష్ణ = కృష్ణ; నీ = నీ యొక్క; సేవ = భక్తి; కాని = తప్పించి; తక్కినవి = మిగిలినవి ఏవి; వలదు = వద్దు; ముక్తి = మోక్షమును; సంధాయి = కలుగజేయువాడవు; అగు = ఐన; నిన్నున్ = నిన్ను; ముట్టను = చేరునట్లు; కొలిచి = సేవించి; ఆత్మ = తనను; బంధంబున్ = సంసారబంధంలోపడుట; కోరునే = వాంఛించునా, వాంఛింపడు; ఆర్యుడు = ఙ్ఞాని; ఎందున్ = ఎన్నడైనను.

భావము:

అచ్యుతా! నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే సంసారమందు పరిభ్రమిస్తున్న పురుషుడికి ఆ సంసారబంధాలు సడలిపోతాయి. సంసార నివృత్తి కలిగినప్పుడు సత్పురుషులతో సహవాసం లభిస్తుంది. సత్సంగం చేత నీయందు భక్తి సిద్ధిస్తుంది. నీయందు నెలకొన్న భక్తి వలన ముక్తి చేకూరుతుంది. నాకు భాగవతోత్తముల సాంగత్యమునకు పూర్వమే రాజ్యపాశ నిర్మూలనం జరిగింది. ఇదంతా నీకృప కృష్ణా! నాకు నీ పాదసేవనం తప్ప తక్కినవేమీ వద్దు. విజ్ఞుడైనవాడు ముక్తిదాయకుడ వైన నిన్నుసేవించి తనకు ప్రతిబంధకా లైన శబ్దాది విషయభోగాలను కోరుకోడు కదా!