పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ముచికుందుడు స్తుతించుట

  •  
  •  
  •  

10.1-1662-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మానసంబు గట్టి హితభోగంబులు
మాని యింద్రియముల దము లడఁచి
పము చేసి యింద్రయ గోరుఁ గాని నీ
మృత పదముఁ గోరఁ జ్ఞుఁ డీశ!

టీకా:

మానసంబున్ = మనస్సును; కట్టి = స్వాధీనముచేసికొని {మనసుకట్టి - మనసును ఇంద్రియ వ్యాపారములందు ప్రవర్తింపనీయక నిలిపికొనుట, మనసును స్వాధీనమున ఉంచుకొనుట}; మహిత = అధికమైన; భోగంబులున్ = భోగములను; మాని = విడిచిపెట్టి; ఇంద్రియముల = ఇంద్రియముల యొక్క; మదములు = గర్వమును, విజృంభణ; అడచి = అణిచివేసి; తపమున్ = తపస్సు; చేసి = చేసి; ఇంద్రియతయ = ఇంద్రపదవి; కోరున్ = అపేక్షించును; కాని = తప్పించి; నీ = నీ యొక్క; అమృతపదమున్ = మోక్షస్థానమును; కోరడు = కోరుకొనడు; అఙ్ఞుడు = తెలివిమాలినవాడు; ఈశ = పరమేశ్వరుడా.

భావము:

పరమేశా! జ్ఞానహీనుడు మనస్సును బంధించి, గొప్ప భోగములను విడనాడి, ఇంద్రియాటోపమును అణచివేసి, తపస్సుచేసి; ఇంద్రపదవి అభిలషిస్తాడే కాని నీ అమృత స్థానమును కోరుకోడు.