పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ముచికుందుడు స్తుతించుట

  •  
  •  
  •  

10.1-1660-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వరసంజ్ఞితమై రథ
రిసేవితమైన యొడలు కాలగతిన్ భీ
మృగభక్షితమై దు
స్తవిట్క్రిమిభస్త్రిసంగతం బగు నీశా!

టీకా:

నరవర = రాజు అని; సంఙ్ఞితము = పిలువబడునది; ఐ = అయ్యి; రథ = రథములచేత; కరి = ఏనుగులచేత; సేవితము = కొలువబడునది; ఐన = అయిన; ఒడలు = దేహము; కాల = కాలము; గతిన్ = గడుచుటచేత; భీకర = భయంకరమైన; మృగ = జంతువులచేత; భక్షితము = తినబడునది; ఐ = అయ్యి; దుస్తర = దాటరాని; విట్ = మలము; క్రిమి = పురుగులు కల; భస్త్రి = తోలుతిత్తి; సంగతంబు = కూడినది; అగున్ = అగును; ఈశా = ఈశ్వరుడా.

భావము:

మాధవా! రాజును అని పేరు వహించి రథాల మీద, ఏనుగుల మీద ఎక్కి తిరిగిన ఈ శరీరం కాలవశమై భయంకరము లైన జంతువులచే భక్షింపబడటం వలన పురీషమనీ, మురిగిపోతే పురుగులనీ, కాలిపోతే బూడిద అనీ వ్యవహరింపబడుతోంది.