పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ముచికుందుడు స్తుతించుట

  •  
  •  
  •  

10.1-1658-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుడ్య సన్నిభం బగు
టుల కళేబరముఁ జొచ్చి నపతి నంచుం
టు చతురంగంబులతో
నిటునటుఁ దిరుగుదును నిన్ను నెఱుఁగమి నీశా!

టీకా:

ఘట = మట్టికుండతోను; కుడ్య = గోడతోను; సన్నిభంబు = పోల్చదగినది; అగు = ఐన; చటుల = చంచలమైన; కళేబరము = అత్మ వినా దేహము; చొచ్చి = ప్రవేశించి; జనపతిన్ = నేను రాజును; అంచున్ = అని; పటు = దిట్టమైన; చతురంగంబుల = చతురంగబలముల {చతురంగంబులు - దేహమురీత్యా 1పంచభూతములు 2ఙ్ఞానేంద్రియములు 3కర్మేంద్రియములు 4అంతరంగచతుష్కము అనెడి నాలుగు అంగములు కలది (ఇంకొక విధముగ) యుద్ధ సేన రీత్యా 1గజ 2తురగ 3రథ 4పదాతులను నాలుగు విభాగములు కల సేన}; తోన్ = తోటి; ఇటునటు = అటునిటు; తిరుగుదును = సంచరింతును; నిన్నున్ = నిన్ను; ఎఱుగమిన్ = తెలియకపోవుటచేత; ఈశా = భగవంతుడా.

భావము:

ప్రభూ! నిన్ను తెలుసుకోకపోవడంతో; కుండ గోడ వలె జడమైన చంచలమైన దేహంలో ప్రవేశించి, నేను రాజు నంటూ రథ, గజ, తురగ, పదాతులతో విఱ్ఱవీగుతూ, భూమి మీద అటునిటు తిరుగుతున్నాను.