పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ముచికుందుడు స్తుతించుట

  •  
  •  
  •  

10.1-1655-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నీ మాయఁ జిక్కి పురుష
స్త్రీమూర్తిక జనము నిన్ను సేవింపదు; వి
త్తాయ గృహగతమై సుఖ
తాసమై కామవంచితంబై యీశా!

టీకా:

నీ = నీ యొక్క; మాయన్ = మాయ యందు; చిక్కి = చిక్కుకొని; పురుష = మగవారు; స్త్రీ = ఆడవారు అను; మూర్తిక = ఆకృతులు కలవారైన; జనము = జనసమూహము; నిన్నున్ = నిన్ను; సేవింపదు = కొలువదు; విత్త = ధనము అనెడి; ఆమయ = తెగులు కల; గృహ = నివాసములను; ఆగతము = పొందినది; ఐ = అయ్యి; సుఖ = సుఖము లనెడి; తామసము = చీకట్లు కలది; ఐ = అయ్యి; కామ = విషయాభిలాషలచే {కామము - ఇంద్రియ విషయములైన ఆహార నిద్రా భయ సంగమ పుష్ప చందనాదుల యెడ లాలస, విషయాసక్తి}; వంచితంబు = వంచింపబడినది; ఐ = అయ్యి; ఈశా = సర్వనియమకస్వామీ.

భావము:

“సర్వేశ్వరా! నీ మాయచేత మోహితులై సుఖలేశం తోపించు విత్తము, గృహాదులు మీద తగులం పొంది వారు వంచితులు అవుతూ, స్త్రీలును పురుషులును నిన్ను భజింపరు.