పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాలయవనుడు నీరగుట

  •  
  •  
  •  

10.1-1639-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నిన లేచి నీల్గి కనుమ్ములు మెల్లన విచ్చి లోపలన్
న్నపు గిన్క వర్ధిల దిల్గని దృష్టి సమిద్ధ విగ్రహో
త్పన్న మహాగ్నికీలముల స్మముచేసె నతండు సాయక
చ్ఛిన్నవిరోధికంఠవను శ్రీభవనున్ యవనున్ లఘుక్రియన్.

టీకా:

తన్నినన్ = తన్నుటచేత; లేచి = నిద్రలేచి; నీల్గి = ఒళ్ళువిరుచుకొని; కను = కళ్ళు అనెడి; తమ్ములున్ = పద్మములను; మెల్లనన్ = మెల్లిగా; విచ్చి = తెరచికొని; లోపలన్ = మనసు లోపల; సన్నపు = చిన్నగా; కిన్క = కినుక, కోపము; వర్థిల్లన్ = పెరుగుతుండగా; దిశల్ = నలుదిక్కులకు; కని = చూసి; దృష్టి = చూపులందు; సమిద్ధ = మిక్కిలి తేజరిల్లుతున్న్; విగ్రహ = అసహనముచేత; ఉత్పన్న = కలిగిన; మహా = గొప్ప; అగ్ని = నిప్పు; కీలములన్ = మంటలచేత; భస్మము = బూడిద; చేసెన్ = చేసెను; అతండు = అతను; సాయక = బాణములచే; ఛిన్న = భేదింపబడిన; విరోధి = శత్రువుల; కంఠ = కంఠములు అను; వనునన్ = వనము కలవానిని; శ్రీభవనున్ = కాలయవనుని {శ్రీభవనుడు - సంపదలకు నిలయమైన వాడు, కాలయవనుడు}; యవనున్ = కాలయవనుని; లఘు = సుళువైన; క్రియన్ = విధముగ.

భావము:

అలా యవనుడు తన్నడంతోనే నిద్రలేచిన ఆ పురుషుడు ఒళ్ళువిరుచుకుంటూ, పద్మాలవంటి కన్నులువిచ్చి, పొటమరించిన కోపం వృద్ధిపొందగా. నాలుగు మూలలా చూసాడు. తన చూపులలో మహోగ్రమైన ఆగ్రహంవలన జనించిన మహాగ్ని జ్వాలలతో ఆయన, శత్రువుల కుత్తుకలనే అడవులను తన కత్తితో ఛేదించినవాడూ, సంపదలకు నిలయమైనవాడూ అయిన కాలయవనుడిని అలవోకగా బూడిద చేసేసాడు.