పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాలయవనుడు వెంటజనుట

  •  
  •  
  •  

10.1-1627-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముల్ దూఱవు; మద్ధనుర్గుణలతాబ్దంబు లేతేర; వీ
రిరింఖోద్ధతిధూళి గప్ప; దకటా! హాస్యుండవై పాఱె; దు
ర్వపై నే క్రియఁ బోరితో కదిసి మున్ వాతాశితోఁ గేశితో
రితో మల్లురతో జరాతనయుతోఁ గంసావనీనాథుతోన్."

టీకా:

శరముల్ = బాణములేవీ; దూఱవు = నాటుకొనలేదు; మత్ = నా యొక్క; ధనుః = వింటి; గుణ = నారి, అల్లెతాడు; శబ్దంబులు = ధ్వనులేవీ; ఏతేరవు = రానేలేదు; ఆ = ఆ యొక్క; హరి = గుఱ్ఱము; రింఖా = డెక్కల, గిట్టల; ఉద్ధతిన్ = విజృంభణమువలని; ధూళిన్ = దుమ్మైనా; కప్పదు = ఆవరించలేదు; అకటా = అయ్యో; హాస్యుండవు = ఎగతాళి చేయబడెడి వాడవు; ఐ = అయ్యి; పాఱెదు = పారిపోతున్నావు; ఉర్వర = భూమి; పైన్ = మీద; ఏ = ఏ; క్రియన్ = విధముగా; పోరితో = యుద్ధము చేసితివో; కదిసి = చేరి; మున్ = ఇంతకుముందు; వాతాశి = అఘాసురుని {వాతాశి - వాయుభక్షకుడు, సర్పము, అఘాసురుడు}; తోన్ = తోటి; కేశి = కేశి అను ఘోటకాసురుని {కేశి - కంసుని వద్ద ఉన్న కేశి అను పేరు గల గుఱ్ఱము రూపు రాక్షసుడు}; తోన్ = తోటి; కరి = కువలయాపీడము {కువలయాపీడము - కువలయ (భూమండలమునకు) పీడము (పీడగా నున్నది), కంసుని వద్ద ఏనుగు}; తోన్ = తోటి; మల్లుర = చాణూర ముష్టికులాదుల {చాణూర ముష్టికాదులు - కంసుని వద్ద మల్లుల్లరు}; తోన్ = తోటి; జరాతనయు = జరాసంధుని {జరాతనయుడు - జర అను రాక్షసి చేత పుట్టినప్పుడు 2 ఖండములుగ నున్న దేహము కలుపుటచేత బతికిన వాడు, మగధదేశాధీశుడు, జరాసంధుడు}; తోన్ = తోటి; కంస = కంసుడు అను; అవనీనాథు = రాజు {అవనీనాథుడు - అవని (రాజ్యమున)కు నాథుడు, రాజు}; తోన్ = తోటి.

భావము:

ఇంకా, నా గుఱ్ఱాల కాలిడెక్కల ధూళి నిన్ను కప్పేయ లేదు. నా వింటి అల్లెత్రాటి మ్రోతలు వినిపించనే లేదు. నీ శరీరంలో నా బాణాలు నాటనే లేదు. అయ్యయ్యో అప్పుడే పారిపోతున్నా వేమిటి. మునుపు కాళీయుడితో, కేశితో, కువలయాపీడంతో, మల్లుజెట్టిలతో, జరాసంధుడితో, కంసడితో ఏలా పోరాడావో ఏమిటో?