పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాలయవనుడు వెంటజనుట

  •  
  •  
  •  

10.1-1625-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లిమిన్ మాధవ! నేఁడు నిన్ను భువనప్రఖ్యాతిగాఁ బట్టుదున్
ముల్ సొచ్చిన, భూమి క్రిందఁ జనినన్, శైలంబుపై నెక్కినన్,
లిదండన్ విలసించినన్, వికృతరూపంబుం బ్రవేశించినన్,
ధిన్ దాఁటిన, నగ్రజన్మ హలి కాశ్వాటాకృతుల్ దాల్చినన్.

టీకా:

బలిమిన్ = బలవంతముగా; మాధవ = కృష్ణా; నేడు = ఇవాళ; నిన్ను = నిన్ను; భువన = లోక; ప్రఖ్యాతి = ప్రసిద్ధము; కాన్ = అగునట్లు; పట్టుదున్ = పట్టుకొనెదను; జలముల్ = నీటిలో; చొచ్చినన్ = (మత్స్యమువై) మునిగిన; భూమి = భూమి; క్రిందన్ = కిందికి వెళ్ళి; చనినన్ = (కూర్మమువై) దూరిన; శైలంబున్ = కొండలు; పైన్ = మీదికి; ఎక్కినన్ = (వరాహుడవై) ఎక్కినను; బలి = బలిచక్రవర్తి; దండన్ = సహాయముచేత; విలసించినన్ = (వామనుడవై)విలసిల్లిన; వికృత = వికారమైన; రూపంబున్ = (నరసింహ) వేషమును; ప్రవేశించినన్ = ధరించినను; జలధిన్ = సముద్రమును; దాటినన్ = (రాముడవై) దాటినను; అగ్రజన్మ = బ్రాహ్మణ (పరశురామ); హలిక = దున్నేవాని (బలరామ); అశ్వాట = గుఱ్ఱపురౌతు (కల్కి); ఆకృతుల్ = వేషములను(అవతారాలు); తాల్చిననన్ = ధరించినను.

భావము:

మాధవా! నీటిలో ప్రవేశించినా (మత్స్యావతారం) భూమి క్రింద దూరినా (కూర్మావతారం) కొండపైకి ఎక్కినా (వరాహావతారం) బలి సమీపాన చేరినా (వామనావతారం) వికారరూపం గైకొన్నా ( నృసింహావతారం) సాగరాన్ని దాటినా (రామావతారం) బ్రాహ్మణ, హాలిక, అశ్వాట రూపాలు ఏవి దాల్చినా (పరశురామ, బలరామ, కల్క్యావతారములు) సరే బలిమితో లోకప్రసిద్ధి పొందేలా నేడు నిన్ను తప్పక పట్టుకుంటాను.